Share News

IPL 2025, LSG vs CSK: చెన్నైకు చివరి ఛాన్స్.. లఖ్‌నవూపై గెలుపు సాధ్యమయ్యేనా

ABN , Publish Date - Apr 14 , 2025 | 04:48 PM

మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పటికే ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. పది సార్లు ఐపీఎల్ ఫైనల్‌కు చేరింది. అలాంటి మేటి జట్టు తాజా సీజన్‌లో మాత్రం దారుణ పరాజయాలను ఎదుర్కొంటోంది. ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడి కేవలం ఒక్క విజయం మాత్రమే సాధించింది.

IPL 2025, LSG vs CSK: చెన్నైకు చివరి ఛాన్స్.. లఖ్‌నవూపై గెలుపు సాధ్యమయ్యేనా
CSK vs LSG

చెన్నై సూపర్ కింగ్స్ (CSK).. ఐపీఎల్‌లో (IPL 2025) అత్యంత విజయవంతమైన టీమ్. మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) సారథ్యంలో ఇప్పటికే ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. పది సార్లు ఐపీఎల్ ఫైనల్‌కు చేరింది. అలాంటి మేటి జట్టు తాజా సీజన్‌లో మాత్రం దారుణ పరాజయాలను ఎదుర్కొంటోంది. ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడి కేవలం ఒక్క విజయం మాత్రమే సాధించింది. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. తొలి స్టేజ్ ముగింపు (ఏడు మ్యాచ్‌లు)కు చేరుకుంటున్న దశలో చెన్నై విజయాల బాట పట్టాల్సిందే.


లఖ్‌నవూలోని ఏకనా స్టేడియంలో ఈ రోజు (ఏప్రిల్ 14) లఖ్‌నవూ, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ (CSK vs LSG) జరగబోతోంది. ఈ మ్యాచ్‌లో విజయం చెన్నై టీమ్‌కు చాలా కీలకం. ఈ మ్యాచ్‌లో కూడా ఓటమి పాలైతే చెన్నై టీమ్‌ ప్లే ఆఫ్స్ అవకాశాలను దాదాపు కోల్పోయినట్టే. ఇక, నుంచి ఆడే అన్ని మ్యాచ్‌లను గెలిస్తేనే చెన్నై టీమ్‌కు ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. రుతురాజ్ గైర్హాజరీలో చెన్నై టీమ్ పగ్గాలను ధోనీ అందుకున్నాడు. కెప్టెన్సీ వహించిన తొలి మ్యాచ్‌లోనే దారుణ పరాజయాన్ని ఎదుర్కొన్నాడు. మరి, పూర్తిగా గాడి తప్పిన చెన్నైను ధోనీ ఎలా గెలుపు బాటన పట్టిస్తాడో చూడాలి.


ఐపీఎల్‌లో ఇప్పటివరకు చెన్నై, లఖ్‌నవూ జట్లు ఐదు సార్లు తలపడ్డాయి. వాటిల్లో లఖ్‌నవూ మూడు సార్లు, చెన్నై రెండు సార్లు గెలుపొందాయి. ఒక్క మ్యాచ్‌ రద్దయింది. తాజా సీజన్‌లో చెన్నై టీమ్ దారుణ పరాజయాలతో సతమతమవుతుంటే, లఖ్‌నవూ మాత్రం వరుస విజయాలతో మంచి ఆత్మవిశ్వాసంతో ఉంది. ఇప్పటివరకు జరిగిన ఆరు మ్యాచ్‌ల్లో నాలుగింట్లో గెలిచి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది.

ఇవీ చదవండి:

రిటైర్మెంట్ ముచ్చటే లేదు

నా ఇన్నింగ్స్‌కు విలువ లేదు: నాయర్

రోహిత్ మాటతో రిజల్ట్ తారుమారు

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 14 , 2025 | 04:48 PM