Priyansh Arya: ప్రియాంశ్ ఆర్య ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ.. ఈ సీజన్‌లో పూరన్ తర్వాత
ABN , Publish Date - Apr 08 , 2025 | 08:28 PM
పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య మరోసారి తన సత్తా చాటాడు. తనకే సాధ్యమైన షాట్లతో అలరిస్తున్నాడు. మిగతా బ్యాటర్లు విఫలమైనా తను మాత్రం వేగంగా ఆడుతూ అద్భుత అర్ధశతకం సాధించాడు. కేవలం 19 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు.

పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య (Priyansh Arya) మరోసారి తన సత్తా చాటాడు. తనకే సాధ్యమైన షాట్లతో అలరిస్తున్నాడు. మిగతా బ్యాటర్లు విఫలమైనా తను మాత్రం వేగంగా ఆడుతూ అద్భుత అర్ధశతకం సాధించాడు. కేవలం 19 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ చేశాడు. ఈ సీజన్‌లో నికోలస్ పూరన్ 18 బంతుల్లోనే సెంచరీ చేసి మొదటి స్థానంలో ఉన్నాడు. (PBKS vs CSK)
మార్చి 27వ తేదీన సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో నికోలస్ పూరన్ ఈ ఘనత సాధించాడు. తాజాగా ప్రియాంశ్ ఆర్య 19 బంతుల్లో ఆ ఘనత సాధించి రెండో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం ఆర్య 30 బంతుల్లో 4 సిక్స్‌లు, 6 ఫోర్లతో 66 పరుగులతో ఆడుతున్నాడు. అయితే అతడికి మిగతా బ్యాటర్ల నుంచి మాత్రం సహకారం కొరవడుతోంది.
పంజాబ్ బ్యాటర్లు అందరూ సింగిల్ డిజట్ స్కోరుకే పరిమితమై పెవిలియన్ చేరారు. ప్రస్తుతం 11 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయిన పంజాబ్ కింగ్స్ 108 పరుగులు చేసింది. ప్రియాంశ్ ఆర్య (67), శశాంక్ సింగ్ (15) క్రీజులో ఉన్నాడు. చెన్నై బౌలర్లలో అశ్విన్, ఖలీల్ అహ్మద్ రెండేసి వికెట్లు తీశారు. ముఖేష్ చౌదరి ఒక వికెట్ పడగొట్టాడు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..