Share News

IPL 2025, PBKS vs KKR: పంజాబ్ మళ్లీ గాడిన పడుతుందా? కోల్‌కతా గెలుపు సాధిస్తుందా

ABN , Publish Date - Apr 15 , 2025 | 05:00 PM

శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని కోల్‌కతా నైట్ రైడర్స్ గతేడాది ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచింది. దాదాపు పదేళ్ల తర్వాత కోల్‌కతాకు శ్రేయస్ ఐపీఎల్ టైటిల్ అందించాడు. కట్ చేస్తే.. కోల్‌కతా నుంచి బయటకు వచ్చిన అయ్యర్‌ను మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ భారీ ధరకు దక్కించుకుంది.

IPL 2025, PBKS vs KKR: పంజాబ్ మళ్లీ గాడిన పడుతుందా? కోల్‌కతా గెలుపు సాధిస్తుందా
PBKS vs KKR

శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) నాయకత్వంలోని కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) గతేడాది ఐపీఎల్ (IPL) ఛాంపియన్‌గా నిలిచింది. దాదాపు పదేళ్ల తర్వాత కోల్‌కతాకు శ్రేయస్ ఐపీఎల్ టైటిల్ అందించాడు. కట్ చేస్తే.. కోల్‌కతా నుంచి బయటకు వచ్చిన అయ్యర్‌ను మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ భారీ ధరకు దక్కించుకుంది. జట్టు పగ్గాలను కూడా అప్పగించింది. ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ కింగ్స్ మూడింట్లో గెలిచి జోరు మీదుంది. ఈ రోజు (ఏప్రిల్ 15) న్యూ ఛండీగఢ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి (PBKS vs KKR).


ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. ఇక, ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ కింగ్స్, కోల్‌కతా జట్లు 33 సార్లు తలపడ్డాయి. వాటిల్లో కోల్‌కతా జట్టు 21 సార్లు విజయం సాధించింది. ఇక, పంజాబ్ కేవలం 12 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలుపొందింది. న్యూ ఛండీగఢ్‌ పిచ్ కూడా బ్యాటింగ్‌కు సహకరిస్తుంది. అయితే టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకోవడం మంచిది. ప్రారంభంలో పిచ్ పేసర్లకు సహకరిస్తుంది. మ్యాచ్ గడిచే కొద్ది బ్యాటింగ్ చేయడం సులభమవుతుంది. ఈ పిచ్‌లో ఛేజింగ్ చేయడం సులభం.


ఈ పిచ్‌లో మొదట బ్యాటింగ్ చేసే జట్టు సులభంగా 180-190 పరుగులు చేయగలుగుతుంది. ఒకవేళ 160 కంటే తక్కువ పరుగులు మాత్రమే చేస్తే ఛేజింగ్ జట్టు సునాయాసంగా గెలిచే అవకాశం ఉంటుంది. న్యూ ఛండీగఢ్‌ హోమ్ గ్రౌండ్ అయినప్పటికీ ఇక్కడ పంజాబ్‌కు అంత మంచి రికార్డు లేదు. ఇక్కడ ఇప్పటిరకు ఏడు మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ కేవలం రెండింట్లో మాత్రమే గెలుపొందింది. ఈ పిచ్ మీద కోల్‌కతా బౌలర్ సునీల్ నరైన్‌కు మంచి రికార్డు ఉంది. ఈ పిచ్‌లో గతేడాది ఒక మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీశాడు.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 15 , 2025 | 07:10 PM