IPL 2025, PBKS vs KKR: కోల్‌కతాకు షాకిచ్చిన పంజాబ్.. ఐపీఎల్ చరిత్రలో రికార్డు విజయం
ABN , Publish Date - Apr 15 , 2025 | 10:44 PM
న్యూ ఛండీగఢ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ దారుణ పరాభవాన్ని చవిచూసింది. స్వల్ప స్కోరుకే ఆలౌటై స్వంత మైదానంలో ఓటమి పాలైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పిచ్‌ను అంచనా వేయడంలో విఫలమయ్యాడు.

న్యూ ఛండీగఢ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. స్వల్ప స్కోరును డిఫెండ్ చేసుకుని కోల్‌కతాకు షాకిచ్చింది. 112 పరుగుల స్వల్ప ఛేదనలో కోల్‌కతా 16 పరుగుల తేడాతో ఓడిపోయింది (PBKS vs KKR). 15.1 ఓవర్లలో 95 పరుగులకే ఆలౌటైంది. గెలుపు ఖాయం అనుకున్న దశ నుంచి అనూహ్యంగా కుప్పకూలింది. పంజాబ్ బౌలర్ ఛాహల్ సత్తా చాటాడు. ఈ సీజన్‌లో పంజాబ్‌కు ఇది నాలుగో విజయం. ఐపీఎల్ చరిత్రలో అతి స్వల్ప స్కోరును డిఫెండ్ చేసుకున్న జట్టుగా పంజాబ్ నిలిచింది.
టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్‌కు మంచి ఆరంభమే లభించింది. ప్రియాంశ్ ఆర్య (22), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (30) తొలి వికెట్‌కు 39 పరుగులు జోడించారు. అయితే హర్షిత్ రాణా చెలరేగి ప్రియాంశ్, ప్రభ్‌సిమ్రన్, శ్రేయస్ అయ్యర్‌ను అవుట్ చేశాడు. ఆ తర్వాత మిగిలిన బ్యాటర్లు ఎవరూ రాణించలేదు. ఓపెనర్లు ఇద్దరూ తప్ప ఇంకెవరూ 20 పరుగులు కూడా చేయలేకపోయారు. దీంతో పంజాబ్ 15.3 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌట్ అయింది. కోల్‌కతా బౌలర్లలో హర్షిత్ రాణా 3 వికెట్లు తీశాడు. వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ రెండేసి వికెట్లు పడగొట్టారు. వైభవ్ అరోరా, నోర్ట్జే ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం 112 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతాకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్లు నరైన్ (5), డికాక్ (2) వరుస ఓవర్లలో అవుటయ్యారు. అయితే రఘువంశీ (37), రహానే (17) సమయోచితంగా ఆడుతూ గెలుపు సులభమే అనిపించారు. ఆ దశలో ఛాహల్ చెలరేగాడు. రహానే, రఘవంశీ, రింకూ సింగ్, రమణ్ దీప్ సింగ్‌ను అవుట్ చేసి దెబ్బ కొట్టాడు. మ్యాక్స్‌వెల్ కీలకమైన వెంకటేష్ అయ్యర్ వికెట్ తీశాడు. ఆ తర్వాత వచ్చిన వారు వచ్చినట్టే వెనుదిరిగారు. అయితే చివర్లో రస్సెల్ (17) కోల్‌కతాను గెలిపించడానికి ప్రయత్నించినా సఫలం కాలేకపోయాడు. దీంతో కేకేఆర్ 15.1 ఓవర్లలో 95 పరుగులకే ఆలౌటైంది.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..