IPL 2025, PBKS vs KKR: టాస్ గెలిచిన పంజాబ్.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే
ABN , Publish Date - Apr 15 , 2025 | 07:04 PM
ఐపీఎల్‌లో సమ ఉజ్జీల పోరుకు రంగం సిద్ధమైంది. మరో ఆసక్తికర మ్యాచ్‌కు తెరలేచింది. ఈ రోజు (ఏప్రిల్ 15) ముల్లాన్‌పూర్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది.

ఐపీఎల్‌లో సమ ఉజ్జీల పోరుకు రంగం సిద్ధమైంది. మరో ఆసక్తికర మ్యాచ్‌కు తెరలేచింది. ఈ రోజు (ఏప్రిల్ 15) న్యూ ఛండీగఢ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి (PBKS vs KKR). ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. ఆరు మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది (PBKS vs KKR). శ్రేయస్ నాయకత్వంలోని పంజాబ్ కింగ్స్, రహానే నాయకత్వంలోని కేకేఆర్ ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశాలు ఉన్న జట్లుగా చాలా మంది భావిస్తున్నారు.
టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ పిచ్‌లో మొదట బ్యాటింగ్ చేసే జట్టు సులభంగా 180-190 పరుగులు చేయగలుగుతుంది. ఒకవేళ 160 కంటే తక్కువ పరుగులు చేస్తే మాత్రం ఛేజింగ్ జట్టు సునాయాసంగా గెలిచే అవకాశం ఉంటుంది. న్యూ ఛండీగఢ్ హోమ్ గ్రౌండ్ అయినప్పటికీ ఇక్కడ పంజాబ్‌కు అంత మంచి రికార్డు లేదు. ఇక్కడ ఇప్పటిరకు ఏడు మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ కేవలం రెండింట్లో మాత్రమే గెలుపొందింది. ఈ పిచ్ మీద కోల్‌కతా బౌలర్ సునీల్ నరైన్‌కు మంచి రికార్డు ఉంది. ఈ పిచ్‌లో గతేడాది ఒక మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీశాడు.
తుది జట్లు:
పంజాబ్ కింగ్స్: ప్రభ్‌సిమ్రన్ సింగ్, ప్రియాంశ్ ఆర్య, శ్రేయస్ అయ్యర్, మార్కస్ స్టోయినిస్, నేహల్ వధేరా, మ్యాక్స్‌వెల్, శశాంక్ సింగ్, ఒమర్జాయ్, మార్కో జాన్సన్, అర్ష్‌దీప్, ఛాహల్
కోల్‌కతా నైట్ రైడర్స్: సునీల్ నరైన్, క్వింటన్ డికాక్, రహానే, రఘువంశీ, వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, రస్సెల్, రమణ్‌దీప్, హర్షిత్ రాణా, నోర్ట్జే, వరుణ్ చక్రవర్తి
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..