IPL 2025: SRH vs RR మ్యాచ్‌లో ఎవరూ ఊహించని ట్విస్ట్.. ఈ ఇద్దరూ యమ డేంజర్
ABN, Publish Date - Mar 23 , 2025 | 12:02 PM
హైదరాబాద్ వేదికగా ఐపీఎల్ 18 సీజన్‌లో రెండో మ్యాచ్ జరగనుంది. రాజస్థాన్, ఎస్‌ఆర్‌హెచ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో గెలుపుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ రెండు జట్లలో ఎవరు గెలుస్తారు.. ఏ జట్టు బలమెంతో తెలుసుకుందాం.

ఐపీఎల్ 18వ సీజన్‌లో రెండో మ్యాచ్ కాసేపట్లో ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌కు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదిక కానుంది. సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఉప్పల్ స్టేడియానికి క్రికెట్ అభిమానులు క్యూ కట్టారు. గత సీజన్‌లో ఫైనల్స్‌కు చేరిన ఎస్‌ఆర్‌హెచ్ ఫ్యాన్స్‌ను నిరాశపర్చింది. టోర్నీ మొత్తం అదరగొట్టిన హైదరాబాద్ జట్టు ఫైనల్ మ్యాచ్‌లో మాత్రం తడబడింది. ఈ ఏడాది ఎలాగైనా ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది. ఐపీఎల్ మొదటి సీజన్‌లో ఛాంపియనగా నిలిచిన రాజస్థాన్ రాయల్స్.. రెండోసారి ట్రోపీ గెలుచుకోలేకపోయింది. ఈ సీజన్‌లో విజేతగా నిలవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది.
బలమైన ఆటగాళ్లు
రెండు జట్లలో బలమైన ఆటగాళ్లున్నారు. బౌలింగ్, బ్యాటింగ్‌తో పాటు ఆల్‌రౌండర్లు రెండు జట్లలో ఉన్నారు. రాజస్థాన్ జట్టులో వెస్టిండీస్ డేంజరస్ బ్యాట్స్‌మెన్ సిమ్రాన్ హెట్‌మెయిర్, హిట్టర్ జైశ్వాల్‌తో పాటు ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్ ఉన్నారు. వీరితో పాటు స్పిన్నర్ హసరంగా, జోఫ్రా ఆర్చర్ ఉండటంతో రాజస్థాన్ జట్టు బౌలింగ్‌లో బలంగా ఉందని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ జట్టులో క్లాసెన్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ వంటి హిటర్లు ఉన్నారు. గత సీజన్‌లో ట్రావిస్ హెడ్ బ్యాటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సిరాజ్, హర్షల్ పటేల్, జంపా వంటి ఆటగాళ్లతో హైదరాబాద్‌కు మంచి బౌలింగ్ లైనప్ ఉంది. దీంతో ఈ మ్యాచ్‌పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఆ ఇద్దరితో డేంజర్
ఫస్ట్ మ్యాచ్‌లో గెలిచి విజయంతో ఈ సీజన్‌ను ప్రారంభించాలని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పట్టుదలతో ఉంది. ముఖ్యగా హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ చేస్తే 200కు పైగా పరుగులు చేస్తే ఈజీగా గెలిచే అవకాశం ఉంది. ఛేంజింగ్ చేస్తే మాత్రం ఇద్దరు బౌలర్లను సమర్థంగా ఎదుర్కుంటే ఈజీగా మ్యాచ్ గెలవొచ్చని స్పోర్ట్స్ అనలిస్ట్‌లు విశ్లేషిస్తున్నారు. ఏ జట్టులోనైనా విదేశీ ఆటగాళ్లు నలుగురికి మించి ఆడే అవకాశం ఉండదు. రాజస్థాన్ జట్టులో ఇద్దరు బ్యాటర్స్, ఇద్దరు బౌలర్లు విదేశీ ఆటగాళ్లు ఉండే ఛాన్స్ ఉంది. ప్లేయింగ్ 11లో బౌలర్లు జోఫ్రా ఆర్చర్, హసరంగకు అవకాశం ఉండొచ్చు. బ్యాటరగా హెట్‌మెయిర్‌క తప్పకుండా అవకాశం ఉండొచ్చు. బౌలర్లు ఆర్చర్, హసరంగాను ధీటుగా ఎదుర్కొంటే ఎస్‌ఆర్‌హెచ్ ఈజీగా విజయం సాధించే అవకాశం ఉంటుంది. కాసేపట్లో ప్రారంభమయ్యే మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఎలా ఆడుతుందోననే ఉత్కంఠ మాత్రం ఫ్యాన్స్‌లో కొనసాగుతూనే ఉంది.
IPO Calender: వచ్చే వారం స్టాక్ మార్కెట్‌కు కొత్త జోష్.. 4 ఐపీవోలు, 5 లిస్టింగ్స్
ఇన్‌పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్.. కొత్త నిబంధనలు?
Gold and Sliver Prices: పైపైకి ఎగబాకుతున్న గోల్డ్ రేటు.. మార్కెట్ ఎలా ఉందంటే..
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here
Updated Date - Mar 23 , 2025 | 12:08 PM