Shooting World Cup Results: నర్మదకు ఆరో స్థానం

ABN, Publish Date - Apr 08 , 2025 | 04:34 AM

ఐఎస్ఎస్‌ఎఫ్‌ వరల్డ్‌కప్‌లో మహిళల 10మీ. ఎయిర్‌ రైఫిల్‌ ఫైనల్లో భారత షూటర్లు నర్మద, సోనమ్‌లు మెడల్స్‌ లేకుండానే వరుసగా ఆరో, ఎనిమిదో స్థానాల్లో నిలిచారు. చైనాకు చెందిన జిఫి వాంగ్‌ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది

Shooting World Cup Results: నర్మదకు ఆరో స్థానం

బ్యూనస్‌ ఎయిర్స్‌ (అర్జెంటీనా): ఐఎస్ఎస్ ఎఫ్‌ వరల్డ్‌క్‌పలో సోమవారం భారత షూటర్లు నిరాశపర్చారు. సోమవారం జరిగిన మహిళల 10 మీ. ఎయిర్‌ రైఫిల్‌ ఫైనల్లో నర్మద నితిన్‌ 166.3 పాయింట్లతో ఆరో స్థానంలో, సోనమ్‌ ఉత్తమ్‌ 124.4 పాయింట్లతో ఎనిమిది స్థానంలో నిలిచారు. జిఫి వాంగ్‌ (చైనా) స్వర్ణం నెగ్గగా.. యుంజీ కవ్వాన్‌ (కొరియా) రజతం, ఆడ్రే గొగ్నియాత్‌ (స్విట్జర్లాండ్‌) కాంస్యం దక్కించుకొన్నారు. అంతకుముందు జరిగిన క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో నర్మద ఆరో స్థానం, సోనమ్‌ తొమ్మిదో స్థానంతో ఫైనల్‌కు అర్హత సాధించారు.



మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 08 , 2025 | 04:35 AM