Share News

Karun Nair : కరుణ్‌ కొత్త రికార్డు

ABN , Publish Date - Jan 04 , 2025 | 05:49 AM

విదర్భ కెప్టెన్‌ కరుణ్‌ నాయర్‌ విజయ్‌ హజారే టోర్నమెంట్‌లో సరికొత్త రికార్డు సృష్టించాడు. ఉత్తరప్రదేశ్‌తో శుక్రవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో సెంచరీ

Karun Nair : కరుణ్‌ కొత్త రికార్డు

విజయనగరం (ఆంధ్రజ్యోతి): విదర్భ కెప్టెన్‌ కరుణ్‌ నాయర్‌ విజయ్‌ హజారే టోర్నమెంట్‌లో సరికొత్త రికార్డు సృష్టించాడు. ఉత్తరప్రదేశ్‌తో శుక్రవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో సెంచరీ సాధించిన కరుణ్‌ నాయర్‌ (112).. లిస్ట్‌-ఎ క్రికెట్‌ (50 ఓవర్ల ఫార్మాట్‌)లో అవుట్‌ కాకుండా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. నాయర్‌ అవుట్‌ కాకుండా ఓవరాల్‌గా 541 పరుగులు కొల్లగొట్టాడు. ఈ క్రమంలో న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ జేమ్స్‌ ఫ్రాంక్లిన్‌ (527) పేరిటనున్న రికార్డును అధిగమించాడు. అంతేకాదు.. ఈ టోర్నీలో నాయర్‌ ఐదు ఇన్నింగ్స్‌ల్లో నాలుగు సెంచరీలు చేసి మరో రికార్డును కూడా ఖాతాలో వేసుకున్నాడు. ఇక, యూపీతో పోరులో విదర్భ 8 వికెట్లతో గెలిచింది.

Updated Date - Jan 04 , 2025 | 05:49 AM