13 నుంచి ఖో-ఖో వరల్డ్ కప్
ABN, Publish Date - Jan 10 , 2025 | 03:34 AM
మొట్టమొదటి ఖోఖో ప్రపంచ కప్ ఈనెల 13 నుంచి 19 వరకు ఇక్కడి ఇందిరా గాంధీ స్టేడియంలో జరగనుంది. భారత ఒలింపిక్ సంఘం పూర్తి సహాయ సహకారాలు...
20 పురుషుల, 19 మహిళల జట్లు
లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో పోటీలు
న్యూఢిల్లీ: మొట్టమొదటి ఖోఖో ప్రపంచ కప్ ఈనెల 13 నుంచి 19 వరకు ఇక్కడి ఇందిరా గాంధీ స్టేడియంలో జరగనుంది. భారత ఒలింపిక్ సంఘం పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న ఈ మెగా టోర్నమెంట్‌లో..20 పురుషుల, 19 మహిళల జట్లు పాల్గొంటున్నాయి. తొలుత గ్రూపు మ్యాచ్‌లు నిర్వహిస్తారు. అనంతరం నాకౌట్ దశ పోటీలు జరుగుతాయి. ఒక్కో గ్రూపులో తొలి రెండు స్థానాలలో నిలిచే జట్లు క్వార్టర్‌ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.
భారత కెప్టెన్లు ప్రతీక్, ప్రియాంక: ఖోఖో ప్రపంచ కప్‌లో తలపడే భారత పురుషులు, మహిళల జట్లను గురువారం ప్రకటించారు. పురుషుల జట్టుకు ప్రతీక్ వైకర్, మహిళల జట్టుకు ప్రియాంక ఇంగ్లే సారథ్యం వహించనున్నారు.
మహిళలు: గ్రూప్-ఎ: భారత్, ఇరాన్, మలేసియా, దక్షిణ కొరియా; గ్రూప్-బి: ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, కెన్యా, ఉగాండా, నెదర్లాండ్స్; గ్రూప్-సి: నేపాల్, భూటాన్, శ్రీలంక, జర్మనీ, బంగ్లాదేశ్; గ్రూప్-డి: దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, పోలెండ్, పెరూ, ఇండోనేసియా; పురుషులు: గ్రూప్-ఎ: భారత్, నేపాల్, పెరూ, భూటాన్, బ్రెజిల్ ;గ్రూప్-బి: దక్షిణకొరియా, ఘనా, అర్జెంటీనా, నెదర్లాండ్స్, ఇరాన్ గ్రూప్-సి: బంగ్లాదేశ్, శ్రీలంక, దక్షిణకొరియా, అమెరికా, పోలెండ్; గ్రూప్-డి: ఇంగ్లండ్, జర్మనీ, మలేసియా, ఆస్ట్రేలియా, కెన్యా.
Updated Date - Jan 10 , 2025 | 03:34 AM