లఖ్‌నవూ థ్రిల్లింగ్ విన్
ABN , Publish Date - Apr 09 , 2025 | 03:51 AM
ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన హైస్కోరింగ్ మ్యాచ్‌లో.. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎ్‌సజీ) థ్రిల్లింగ్ విక్టరీని నమోదు చేసింది. రహానె (35 బంతుల్లో 61) అర్ధ శతకంతో ప్రత్యర్థిని వణికించినా.. శార్దూల్, దిగ్వేష్ రాఠీ కీలక సమయంలో...

చెలరేగిన పూరన్, మార్ష్
4 పరుగులతో ఓడిన కోల్‌కతా
కోల్‌కతా: ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన హైస్కోరింగ్ మ్యాచ్‌లో.. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎ్‌సజీ) థ్రిల్లింగ్ విక్టరీని నమోదు చేసింది. రహానె (35 బంతుల్లో 61) అర్ధ శతకంతో ప్రత్యర్థిని వణికించినా.. శార్దూల్, దిగ్వేష్ రాఠీ కీలక సమయంలో వికెట్లు పడగొట్టి కోల్‌కతా జోరుకు బ్రేకులేశారు. దీంతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ 4 పరుగులతో కోల్‌కతాపై నెగ్గింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పూరన్ (36 బం తుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో 87 నాటౌట్), మార్ష్ (48 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 81) అర్ధ శతకాలతో దుమ్మురేపడంతో.. తొలుత లఖ్‌నవూ 20 ఓవర్లలో 3 వికెట్లకు 238 పరుగులు చేసింది. ఛేదనలో కోల్‌కతా ఓవర్లన్నీ ఆడి 234/7 స్కోరుకు పరిమితమైంది. వెంకటేష్ అయ్యర్ (45), రింకూ (15 బంతుల్లో 38 నాటౌట్) శ్రమ వృథా అయింది.
ఆఖర్లో తడబాటు: విజయానికి 43 బంతుల్లో 77 పరుగులే కావాల్సి రావడంతో నైట్‌రైడర్స్ సులువుగానే గెలుస్తుందని భావించారు. కానీ, రహానెను శార్దూల్ అవుట్ చేయడంతో.. కోల్‌కతా ఇన్నింగ్స్ గాడితప్పింది. కేవలం 15 పరుగుల తేడాతో నాలుగు వికెట్లు చేజార్చుకొని కష్టాల్లో పడింది. చివరి ఓవర్‌లో విజయానికి 24 పరుగులు కావాల్సి ఉండగా.. రింకూ మ్యాజిక్ చేయలేక పోయాడు. అంతకుముందు డికాక్ (15) స్వల్ప స్కోరుకే వెనుదిరిగినా.. మరో ఓపెనర్ నరైన్ (30)తో కలసి రెండో వికెట్‌కు 54 పరుగులు జోడించిన రహానె.. అయ్యర్‌తో కలసి మూడో వికెట్‌కు 71 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
అదరగొట్టిన టాపార్డర్: టాపార్డర్ బ్యాటర్లు చెలరేగడంతో లఖ్‌నవూ భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జట్టుకు ఓపెనర్లు మార్‌క్రమ్, మార్ష్ తొలి వికెట్‌కు 99 పరుగుల భాగస్వామ్యంతో బలమైన పునాది వేశారు. కానీ, వన్‌డౌన్‌లో వచ్చిన పూరన్.. మార్ష్‌తో రెండో వికెట్‌కు 71 రన్స్ జోడించాడు.
స్కోరుబోర్డు
లఖ్‌నవూ: మార్‌క్రమ్ (బి) హర్షిత్ 47, మార్ష్ (సి) రింకూ (బి) రస్సెల్ 81, పూరన్ (నాటౌట్) 87, సమద్ (బి) హర్షిత్ 6, మిల్లర్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: 20 ఓవర్లలో 238/3; వికెట్ల పతనం: 1-99, 2-170, 3-221; బౌలింగ్: వైభవ్ 4-0-35-0, జాన్సన్ 3-0-46-0, వరుణ్ 4-0-31-0, హర్షిత్ 4-0-51-2, నరైన్ 3-0-38-0, రస్సెల్ 2-0-32-1.
కోల్‌కతా: డికాక్ (ఎల్బీ) ఆకాశ్ దీప్ 15, నరైన్ (సి) మార్‌క్రమ్ (బి) రాఠీ 30, రహానె (సి) పూరన్ (బి) శార్దూల్ 61, వెంకటేష్ (సి) మార్‌క్రమ్ (బి) ఆకాశ్ దీప్ 45, రమణ్‌దీప్ (సి) మార్‌క్రమ్ (బి) బిష్ణోయ్ 1, రఘువంశీ (సి) పంత్ (బి) అవేశ్ 5, రస్సెల్ (సి) మిల్లర్ (బి) శార్దూల్ 7, రింకూ (నాటౌట్) 38, హర్షిత్ (నాటౌట్) 10; ఎక్స్‌ట్రాలు: 22; మొత్తం: 20 ఓవర్లలో 234/7; వికెట్ల పతనం: 1-37, 2-91, 3-162, 4-166, 5-173, 6-177, 7-185; బౌలింగ్: ఆకాశ్ దీప్ 4-0-55-2, శార్దూల్ 4-0-52-2, అవేశ్ 4-0-45-1, దిగ్వేష్ 4-0-33-1, బిష్ణోయ్ 4-0-47-1.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..