ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

England series : షమి వచ్చేశాడు

ABN, Publish Date - Jan 12 , 2025 | 05:44 AM

భారత వెటరన్‌ పేసర్‌ మహ్మద్‌ షమి పునరాగమనంపై కొనసాగుతున్న ఊహాగానాలకు తెర పడింది. 14 నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఎట్టకేలకు తను టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. ఇంగ్లండ్‌తో

14 నెలల తర్వాత జట్టులోకి స్టార్‌ పేసర్‌

నితీశ్‌, తిలక్‌కు చోటు

వైస్‌ కెప్టెన్‌గా అక్షర్‌ పటేల్‌

ఇంగ్లండ్‌తో సిరీస్‌కు భారత టీ20 జట్టు

మహిళల రెండో వన్డే నేడు

భారత్‌ గీ ఐర్లాండ్‌

ఉ. 11 గం. నుంచి స్పోర్ట్స్‌-18లో..

న్యూఢిల్లీ: భారత వెటరన్‌ పేసర్‌ మహ్మద్‌ షమి పునరాగమనంపై కొనసాగుతున్న ఊహాగానాలకు తెర పడింది. 14 నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఎట్టకేలకు తను టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. ఇంగ్లండ్‌తో ఈనెల 22 నుంచి జరుగబోయే ఐదు టీ20ల సిరీస్‌ కోసం సెలెక్టర్లు 15 మందితో కూడిన భారత జట్టును ప్రకటించారు. అయితే చాంపియన్స్‌ ట్రోఫీకి ఆదివారమే తుది గడువు అయినా ప్రాథమిక జట్టు (వన్డే)ను ప్రకటించకపోవడం గమనార్హం. టీ20 జట్టుకు సూర్యకుమార్‌ నేతృత్వం వహిస్తుండగా, వైస్‌ కెప్టెన్‌గా అక్షర్‌ పటేల్‌ను ఎంపిక చేశారు. ఇక 34 ఏళ్ల షమి చివరిసారిగా భారత్‌ తరఫున 2023 వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్‌లో ఆడాడు. మోకాలి గాయంతో జట్టుకు దూరమైన షమి జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) పునరావాస శిబిరంలో చేరి కోలుకున్నాడు. ఆ తర్వాత బెంగాల్‌ తరఫున సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో తొమ్మిది మ్యాచుల్లో 11 వికెట్లు, విజయ్‌ హజారేలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఐదు వికెట్లు తీసి రాణించాడు. అయితే ఈ రెండు టోర్నీల మధ్యలో మోకాలి వాపునకు గురి కావడంతో ఆసీస్‌ టూర్‌కు వెళ్లలేకపోయాడు. ప్రస్తుతం ఎన్‌సీఏ నుంచి షమి ఫిట్‌నె్‌సకు సంబంధించి అనుమతి రావడంతో సెలెక్టర్లు ఇంగ్లండ్‌తో సిరీ్‌సకు ఎంపిక చేశారు.


వచ్చే నెలలో జరిగే చాంపియన్స్‌ ట్రోఫీలోనూ షమి ఆడే అవకాశం ఉండడంతో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ల ద్వారా షమిని అంచనా వేసే అవకాశం ఉంది. అయితే అతడిపై ఒత్తిడి పడకుండా చూసేందుకు అన్ని మ్యాచ్‌లను ఆడించకపోవచ్చని సమాచారం. అటు ప్రధాన వికెట్‌ కీపర్‌గా సంజూ శాంసన్‌నే కొనసాగించారు. మరోవైపు బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ ఆడిన నలుగురు ఆటగాళ్లు నితీశ్‌ రెడ్డి, హర్షిత్‌ రాణా, ధ్రువ్‌ జురెల్‌, వాషింగ్టన్‌ సుందర్‌ టీ20 జట్టులో చేరారు. దీంతో గత నవంబరులో దక్షిణాఫ్రికాతో ఆడిన రమణ్‌దీప్‌ సింగ్‌, యష్‌ దయాళ్‌, అవేశ్‌, జితేశ్‌ శర్మ స్థానాలను కోల్పోయారు. ప్రస్తుత జట్టులో అక్షర్‌, బిష్ణోయ్‌, వరుణ్‌, సుందర్‌ల రూపంలో నలుగురు స్పిన్నర్లు ఉండడం విశేషం. గాయం కారణంగా రియాన్‌ పరాగ్‌ను పరిగణనలోకి తీసుకోలేదు. కీపర్‌ రిషభ్‌ పంత్‌, ఓపెనర్‌ జైస్వాల్‌, గిల్‌లకు విశ్రాంతినిచ్చారు.

ఇదీ జట్టు

సూర్యకుమార్‌ (కెప్టెన్‌), శాంసన్‌, అభిషేక్‌, తిలక్‌ వర్మ, హార్దిక్‌, రింకూ సింగ్‌, నితీశ్‌ కుమార్‌, అక్షర్‌, హర్షిత్‌, అర్ష్‌దీప్‌, షమి, వరుణ్‌ చక్రవర్తి, రవి బిష్ణోయ్‌, సుందర్‌, ధ్రువ్‌ జురెల్‌.

Updated Date - Jan 12 , 2025 | 05:44 AM