Asian Athletics Championship: నిత్య డబుల్‌

ABN, Publish Date - Mar 29 , 2025 | 07:06 AM

తెలంగాణకు చెందిన నిత్య గంథె ఇండియన్‌ గ్రాండ్‌ప్రీ-1 పోటీల్లో 100 మరియు 200 మీటర్ల రేస్‌లలో డబుల్‌ సాధించి అగ్రస్థానంలో నిలిచింది. జ్యోతి యర్రాజి 100 మీటర్ల హర్డిల్స్‌లో టైటిల్‌ గెలిచింది

Asian Athletics Championship: నిత్య డబుల్‌
  • జ్యోతికి హర్డిల్స్‌ టైటిల్‌

  • ఇండియన్‌ గ్రాండ్‌ప్రీ-1

బెంగళూరు: తెలంగాణకు చెందిన నిత్య గంథె ఇండియన్‌ గ్రాండ్‌ప్రీ-1 పోటీల్లో డబుల్‌ సాధించింది. శుక్రవారం ఇక్కడ జరిగిన మహిళల 100, 200 మీటర్ల ఈవెంట్లలో నిత్య అగ్రస్థానంలో నిలిచింది. కాగా 100మీ. హర్డిల్స్‌లో ఆంధ్రకు చెందిన జ్యోతి యర్రాజి సత్తాచాటింది. 100 మీటర్ల పరుగులో నిత్య 11.41 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుంది. ఇక 200 మీటర్ల పరుగును నిత్య 23.36 సెకన్లలో పూర్తిచేసి టాప్‌లో నిలవగా, జ్యోతి (23.55 సె) రెండో స్థానంతో సరిపెట్టుకుంది. 100 మీటర్ల హర్డిల్స్‌లో జ్యోతి టైటిల్‌ను దక్కించుకుంది. జ్యోతి 13.07 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని ప్రథమస్థానంలో నిలిచింది. కాగా ఇక్కడి ప్రదర్శనతో నిత్య, జ్యోతి ఆసియా అథ్లెటిక్‌ చాంపియన్‌షి్‌పనకు అర్హత సాధించారు.

గురిందర్‌వీర్‌ రికార్డు పరుగు: స్ర్పింటర్‌ గురిందర్‌వీర్‌ సింగ్‌ అత్యంత వేగంగా 100మీ. రేసును పూర్తి చేసిన భారత అథ్లెట్‌గా నిలిచాడు. రిలయన్స్‌ తరఫున బరిలోకి దిగిన ఈ పంజాబీ 10.20 సెకన్లలోనే రేసును పూర్తి చేశాడు. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం మణికంఠ హొబ్లిధర్‌ నెలకొల్పిన రికార్డు (10.23సె)ను అధిగమించాడు. మణికంఠ (10.22) ద్వితీయ స్థానంలో, అమలన్‌ బోర్గోహైన్‌ (10.43) తృతీయ స్థానాల్లో నిలిచారు.

Updated Date - Mar 29 , 2025 | 07:07 AM