Lahore Tournament: లాహోర్‌లో మహిళల వన్డే వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్
ABN, Publish Date - Mar 15 , 2025 | 01:28 AM
పూర్తిస్థాయి సభ్య దేశాలైన ఆతిథ్య పాకిస్థాన్, బంగ్లాదేశ్, వెస్టిండీస్, ఐర్లాండ్‌లతో పాటు అసోసియేట్ సభ్యదేశాలు స్కాట్లాండ్, థాయ్‌లాండ్ జట్ల మధ్య ఈ టోర్నీ జరగనుంది.

న్యూఢిల్లీ: మహిళల వన్డే వరల్డ్‌కప్ క్వాలిఫయర్ టోర్నమెంట్‌కు పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనుంది. ఆరు జట్లు పాల్గొనే ఈ ఈవెంట్ వచ్చేనెల 9 నుంచి 19 వరకు లాహోర్‌లో జరగనుంది. పూర్తిస్థాయి సభ్య దేశాలైన ఆతిథ్య పాకిస్థాన్, బంగ్లాదేశ్, వెస్టిండీస్, ఐర్లాండ్‌లతో పాటు అసోసియేట్ సభ్యదేశాలు స్కాట్లాండ్, థాయ్‌లాండ్ జట్ల మధ్య ఈ టోర్నీ జరగనుంది. తొలి రెండుస్థానాల్లో నిలిచిన జట్లు ఈ ఏడాది అక్టోబరు-నవంబరులో భారత్ వేదికగా జరిగే మహిళల వన్డే వరల్డ్‌క్‌పనకు అర్హత సాధిస్తాయి. ఈ వరల్డ్‌క్‌పలో ఎనిమిది జట్లు తలపడనున్నాయి. కాగా, ఐసీసీ మహిళల చాంపియన్‌షిప్ (2022-25) సైకిల్‌లో భాగంగా తొలి ఆరు స్థానాల్లో నిలవడం ద్వారా ఆతిథ్య భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక నేరుగా వరల్డ్‌క్‌పకు అర్హత సాధించాయి. మిగిలిన రెండు జట్లు క్వాలిఫయర్ ఈవెంట్ ద్వారా ఎంపికవుతాయి.
Updated Date - Mar 15 , 2025 | 01:28 AM