Share News

IPL 2025 SRH Vs PBKS Live: పంజాబ్ కింగ్స్ వీర బాదుడు.. సన్ రైజర్స్ ముందు దిమ్మతిరిగే లక్ష్యం

ABN , Publish Date - Apr 12 , 2025 | 09:48 PM

సన్‌రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ పరుగుల వరద పారించారు. హైదరాబాద్ బౌలర్స్‌తో చెడుగుడు ఆడుకుంటూ ఐపీఎల్ చరిత్రలో తమ రెండో అతిపెద్ద స్కోరును నమోదు చేశారు.

IPL 2025 SRH Vs PBKS Live:  పంజాబ్ కింగ్స్ వీర బాదుడు.. సన్ రైజర్స్ ముందు దిమ్మతిరిగే లక్ష్యం
IPL 2025 SRH Vs PBKS Live

పంజాబ్ కింగ్ విజృంభించింది. స్టేడియంలో పరుగుల వరద పారించింది. 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసి సన్ రైజర్స్ బౌలర్లకు చుక్కలు చూపించింది. టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యరు మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆ తరువాత బరిలోకి దిగిన బ్యాటర్లు వరుసగా సన్‌రైజర్స్ బౌలింగ్‌ను చీల్చి చెండాడారు. ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్ తొలి నాలుగు ఓవర్లలోనే 66 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి పంజాబ్ దూకుడు ఇన్నింగ్స్ ఆసాంతం కొనసాగేలా పటిష్ఠ పునాది వేశారు. ఏడో ఓవర్ కల్లా ఈ ఇద్దరు పెవిలియన్ బాట పట్టినా పంజాబ్ జోరు మాత్రం తగ్గలేదు. అప్పటికే స్కోరు 100 పరుగులు దాటింది. నీహాల్ వధేలా కూడా ఓ మోస్తరుగా రాణించాడు.


మరోవైపు, ఓపెనర్లు ఇచ్చిన శుభారంభాన్ని సద్వినియోగం చేసుకుంటూ శ్రేయస్ అయ్యర్ రెచ్చిపోయాడు. 11వ ఓవర్ తరువాత కనీవినీ ఎరుగని రీతిలో విజృంభించాడు. ఫోర్లు, సెక్సులతో హైదరాబాద్ అభిమానులను టెన్షన్‌లో ముంచేశాడు. 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని అదే దూకుడును చివరి వరకూ కొనసాగించాడు. మిడిల్ ఓవర్స్‌కు జట్టు స్కోరును పరుగులు పెట్టించాడు. జస్ట్ 36 బంతుల్లో 82 పరుగులు రాబట్టి సన్‌రైజర్స్‌కు భారీ షాకిచ్చాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో పంజాబ్‌ తన రెండో అతి భారీ స్కోరు నమోదు చేసింది.


సన్‌రైజర్స్ బౌలర్లలో షమీ నిరాశ పరిచాడు. వేసిన నాలుగు ఓవర్లలో ఏకంగా 75 పరుగులు సమర్పించుకున్నాడు. పాట్ కమిన్స్ కూడా నిరాశపరిచాడు. ఇక హర్షల్ పటేల్ నాలుగు, ఇషాన్ మలింగ్ రెండు వికెట్లు తీశారు.

ఇవి కూడా చదవండి:

మరో ఉత్కంఠ మ్యాచ్ షురూ.. టాస్ గెలిచిన పంజాబ్

గుజరాత్‌కు గట్టి షాక్.. మరో తోపు ప్లేయర్ దూరం

బచ్చా ప్లేయర్ కాళ్లు మొక్కిన బ్రావో

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 12 , 2025 | 09:48 PM