ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రీక్వార్టర్స్‌కుప్రణయ్‌,మాళవిక

ABN, Publish Date - Jan 09 , 2025 | 02:04 AM

భారత స్టార్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌, వర్ధమాన షట్లర్‌ మాళవిక బన్సోడ్‌ మలేసియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో ప్రీక్వార్టర్స్‌కు దూసుకెళ్లారు. పురుషుల డబుల్స్‌లో ఏస్‌ జంట...

మలేసియా ఓపెన్‌లో సాత్విక్‌ జోడీ బోణీ

కౌలాలంపూర్‌: భారత స్టార్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌, వర్ధమాన షట్లర్‌ మాళవిక బన్సోడ్‌ మలేసియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో ప్రీక్వార్టర్స్‌కు దూసుకెళ్లారు. పురుషుల డబుల్స్‌లో ఏస్‌ జంట సాత్విక్‌ సాయిరాజ్‌/చిరాగ్‌ శెట్టి కూడా శుభారంభం చేసింది. ఇండోర్‌ స్టేడియం పైకప్పు నుంచి నీళ్లు లీకైన కారణంగా మంగళవారం ప్రణయ్‌, బ్రయాన్‌ యాంగ్‌ (కెనడా) మధ్య తొలిరౌండ్‌ మ్యాచ్‌ను అర్ధంతరంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. మ్యాచ్‌ నిలిపివేసే సమయానికి ప్రణయ్‌ 21-12, 9-11తో ఉన్నాడు. ఈ మ్యాచ్‌ను బుధవారం కొనసాగించగా.. చివరకు ప్రణయ్‌ 21-12, 17-21, 21-15తో బ్రయాన్‌ను ఓడించాడు. మహిళల సింగిల్స్‌ ఆరంభ రౌండ్లో మాళవిక 21-15, 21-16తో స్థానిక ఫేవరెట్‌ గో జిన్‌ వీని చిత్తుచేసింది. సాత్విక్‌/చిరాగ్‌ ద్వయం 21-10, 16-21, 21-5తో లోకల్‌ జంట టాంగ్‌ కాయ్‌ వీ/మింగ్‌ చెలూపై నెగ్గి ప్రీక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో భారత్‌కు చెందిన తనీషా/ధ్రువ్‌ జోడీ 21-13, 21-14తో దక్షిణ కొరియా జంట సంగ్‌ హ్యూన్‌/హే వోన్‌పై, సతీ్‌ష/ఆద్య ద్వయం 21-13, 21-15తో సహచర జోడీ సూర్య/అమృతపై నెగ్గి ప్రీక్వార్టర్స్‌కు చేరాయి. మిగతా భారత షట్లర్లలో సింగిల్స్‌లో ప్రియాన్షు రజావత్‌, అనుపమ, ఆకర్షి కశ్యప్‌.. డబుల్స్‌లో అశ్వినీ పొన్నప్ప/తనీషా జంట, రీతూపర్ణ/శ్వేతాపర్ణ ద్వయం ప్రత్యర్థుల చేతిలో ఓటమిపాలై తొలి రౌండ్లోనే వెనుదిరిగారు.

Updated Date - Jan 09 , 2025 | 02:04 AM