క్వార్టర్స్‌కు రాజస్థాన్, హరియాణా
ABN, Publish Date - Jan 10 , 2025 | 03:18 AM
అభిజిత్ తోమర్ (111) అదిరే శతకంతో.. రాజస్థాన్ విజయ్ హజారే ట్రోఫీ క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన ప్రీక్వార్టర్స్‌లో రాజస్థాన్ 19 పరుగుల తేడాతో తమిళనాడుపై...
విజయ్ హజారే ట్రోఫీ
వడోదర: అభిజిత్ తోమర్ (111) అదిరే శతకంతో.. రాజస్థాన్ విజయ్ హజారే ట్రోఫీ క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన ప్రీక్వార్టర్స్‌లో రాజస్థాన్ 19 పరుగుల తేడాతో తమిళనాడుపై గెలిచింది. తొలుత రాజస్థాన్ 47.3 ఓవర్లలో 267 పరుగులకు ఆలౌటైంది. వరుణ్ చక్రవర్తి 5 వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో తమిళనాడు 47.1 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటైంది. ట్రోఫీ చరిత్రలో తమిళనాడుపై రాజస్థాన్ గెలవడం ఇదే తొలిసారి.
షమి 3 వికెట్లు పడగొట్టినా.. : మరో ప్రీక్వార్టర్స్ మ్యాచ్‌లో హరియాణా 72 పరుగుల తేడాతో బెంగాల్‌ను చిత్తు చేసింది. తొలుత హరియాణా 298/9 స్కోరు చేసింది. నిశాంత్ (64, 2/36), పార్థ్ (62, 3/33) అర్ధ శతకాలు సాధించారు. షమి 3 వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో బెంగాల్ 43.1 ఓవర్లలో 226 పరుగులకు ఆలౌటైంది.
Updated Date - Jan 10 , 2025 | 03:18 AM