ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Indian Cricket : జడ్డూకు చోటు దక్కేనా!

ABN, Publish Date - Jan 11 , 2025 | 05:55 AM

భారత క్రికెట్‌లో ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాది ప్రత్యేక స్థానం. బౌలింగ్‌, బ్యాటింగే కాకుండా అద్భుతమైన ఫీల్డర్‌గా పేరు తెచ్చుకున్నాడు.

  • యువ ఆటగాళ్లపై దృష్టి

  • రేసులో వరుణ్‌ చక్రవర్తి

  • యువ ఆటగాళ్లపై దృష్టి

  • రేసులో వరుణ్‌ చక్రవర్తి

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌లో ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాది ప్రత్యేక స్థానం. బౌలింగ్‌, బ్యాటింగే కాకుండా అద్భుతమైన ఫీల్డర్‌గా పేరు తెచ్చుకున్నాడు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తను కేవలం సుదీర్ఘ ఫార్మాట్‌కే పరిమితమయ్యేలా కనిపిస్తున్నాడు. ఎందుకంటే ఇప్పటికే జడ్డూ టీ20లకు వీడ్కోలు పలకగా.. తాజాగా వన్డేల్లోనూ అతడిని కొనసాగించడంపై సందేహాలు నెలకొన్నాయి. ఈ నెలలో ఇంగ్లండ్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీ్‌సలతో పాటు ఫిబ్రవరి 19 నుంచి జరిగే చాంపియన్స్‌ ట్రోఫీకి భారత జట్టును ప్రకటించాల్సి ఉంది. అంతేకాకుండా 2027 వరల్డ్‌కప్‌ను కూడా దృష్టిలో ఉంచుకుని యువ ఆటగాళ్లకు స్థానం కల్పించాలి. ఈనేపథ్యంలో జడ్డూకు చోటు దక్కడం కష్టమేనన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు 2023 వన్డే వరల్డ్‌కప్‌ తర్వాత 50 ఓవర్ల ఫార్మాట్‌లో అతను జట్టుకు ఆడింది లేదు. అలాగే ఆల్‌రౌండర్‌ విభాగంలో జడ్డూకు అక్షర్‌, సుందర్‌, దూబే, రియాన్‌ పరాగ్‌ గట్టి పోటీ ఇస్తున్నారు. హార్దిక్‌కు ఎలాగూ బెర్త్‌ ఖాయమే. దీనికి తోడు ఇటీవలి ఆస్ట్రేలియా పర్యటనలోనూ జడేజా ఆకట్టుకోలేకపోయాడు. అతను ఆడిన మూడు టెస్టుల్లో తీసింది నాలుగు వికెట్లే. బ్యాటింగ్‌లో మాత్రం ఓ అర్ధసెంచరీ చేశాడు. అందుకే భవిష్యత్‌ టోర్నీల్లో జడ్డూ లేకుండానే ముందుకు వెళ్లాలని సెలెక్టర్లు భావిస్తున్నట్టు బోర్డు వర్గాల సమాచారం. అయితే ఇంగ్లండ్‌తో ఆడబోయే టెస్టు సిరీస్‌లో మాత్రం జడేజా స్థానానికి ఢోకా ఉండకపోవచ్చు. కాగా, మిడిలార్డర్‌లో అనుభవజ్ఞుడైన ఆటగాడు లేకపోవడం అతడికి కలిసొచ్చే అంశం. మరోవైపు అదృష్టం బాగుంటే అతను చాంపియన్స్‌ ట్రోఫీలోనూ ఆడే అవకాశం లేకపోలేదన్నది కొందరి అభిప్రాయం. ఎందుకంటే ఈ మెగా టోర్నీలో భారత్‌ ఆడే మ్యాచ్‌లు దుబాయ్‌లో జరుగనున్నాయి. అక్కడి పిచ్‌లు ఎక్కువగా స్పిన్నర్లకే అనుకూలిస్తుంటాయి. దీంతో అపార అనుభవం కలిగిన వెటరన్‌ జడేజా జట్టులో ఉంటే సహాయకంగా ఉంటుందని సెలెక్టర్లు భావిస్తే మాత్రం అతను కూడా దుబాయ్‌ విమానం ఎక్కే ఆస్కారం ఉంది.


  • గౌతీచూపు ఇతనివైపు

ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరఫున విశేషంగా ఆకట్టుకున్న లెగ్‌ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తికి చాంపియన్స్‌ ట్రోఫీలో చోటు దక్కేలా ఉంది. ఈనెల 12 వరకు ఈ టోర్నీలో పాల్గొనే భారత ప్రాథమిక జట్టును ప్రకటించేందుకు గడువు ఉంది. ఇందులో భాగంగా స్పిన్‌ విభాగంలో వరుణ్‌ కూడా గట్టి పోటీదారుడుగా ఉన్నట్టు సమాచారం. జడేజా సహా ఇతర స్పిన్నర్లకంటే కూడా తనే రేసులో ముందున్నట్టు చెబుతున్నారు. కుల్దీప్‌ యాదవ్‌ ఫిట్‌నె్‌సపై సందేహాలు నెలకొనడంతో కోచ్‌ గంభీర్‌ చూపు వరుణ్‌పై పడింది. గతేడాది కేకేఆర్‌ విజేతగా నిలవడంలో వరుణ్‌ది కీలక పాత్ర. అలాగే ఆ సమయంలో జట్టు మెంటార్‌గా గంభీర్‌ వ్యవహరించాడు. తొలిసారి 2021 టీ20 వరల్డ్‌క్‌పలో తను జట్టుకు ఎంపికైనా ప్రభావం చూపలేదు. ఆ తర్వాత ఐపీఎల్‌ ప్రభావంతో గతేడాది తిరిగి చోటు దక్కించుకుని మెరుగ్గా రాణించాడు. అయితే ఇప్పటివరకు వన్డేల్లో మాత్రం అరంగేట్రం చేయలేదు.

Updated Date - Jan 11 , 2025 | 05:55 AM