Share News

Rohit Sharma: ఐపీఎల్‌లో మరోసారి రోహిత్ శర్మ విఫలం.. నెట్టింట జనాల ఆక్రోశం

ABN , Publish Date - Apr 01 , 2025 | 11:13 AM

బ్యాటింగ్‌లో మరోసారి విఫలమైన రోహిత్ శర్మపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకూ ఆడిన మూడు మ్యాచుల్లో రోహిత్ కేవలం 21 పరుగులే చేయడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Rohit Sharma: ఐపీఎల్‌లో మరోసారి రోహిత్ శర్మ విఫలం.. నెట్టింట జనాల ఆక్రోశం
Rohit Sharma

ఇంటర్నెట్ డెస్క్: కేకేఆర్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో మరోసారి రోహిత్ శర్మ అభిమానులకు నిరాశే ఎదురైంది. ఓ సిక్స్ కొట్టి దూకుడు ప్రదర్శించిన రోహిత్ ఆండ్రే రసెల్ బౌలింగ్‌లో ఔటవడం అభిమానులను తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. ఇప్పటివరకూ జరిగిన 3 మ్యాచుల్లో రోహిత్ కేవలం 21 పరుగులు చేశాడంటే ఫామ్ లేమితో ఎంతగా సతమతమవుతున్నాడో అర్థం చేసుకోవచ్చు. ముంబై ఇండియన్స్ విజయం సాధించినా జనాలు మాత్రం రోహిత్‌ను ఉపేక్షించడం లేదు. నెట్టింట విమర్శన జడి కురిపిస్తున్నారు. ధోనీతో పోలుస్తూ చెడుగుడు ఆడుకుంటున్నారు.


Also Read: రియాన్‌ పరాగ్‌కు రూ.12 లక్షల జరిమానా

మరోవైపు, ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ మైఖేల్‌ వాన్‌‌ కూడా రోహిత్‌పై కఠిన వ్యాఖ్యలు చేశాడు. మరో ఆటగాడు రోహిత్‌లా స్వల్ప పరుగులు చేసి ఉంటే ఈ పాటికే జట్టులో స్థానం కోల్పోయి ఉండేవాడని అన్నాడు. ‘‘అతడు రోహిత్‌ శర్మ కాబట్టే ఇంకా టీంలో కొనసాగుతున్నాడు. రోహిత్ నుంచి ఈ ప్రదర్శన సరికాదు. అతడు మరిన్ని పరుగులు చేయాల్సిన అవసరం ఉంది. అతడిని టీమ్‌ నుంచి తప్పించాలని నేను అనడం లేదు. రోహిత్‌ శర్మ మళ్లీ తన ఫామ్‌ పొందాలి. ముంబయి తరఫున కచ్చితంగా పెద్ద స్కోర్స్‌ చేయాలి’’ అని మైఖేల్‌ వాన్‌ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు.


MS Dhoni: కీలక సమయంలో ధోనీ అవుట్.. చెన్నై అభిమాని రియాక్షన్ చూస్తే

ఇక ఇంతకాలం విజయం కోసం ఎదురుచూసిన ఎమ్ఐ నిన్నటి మ్యాచ్‌లో తొలిసారిగా విజయానందం పొందిన విషయం తెలిసిందే. ఎమ్ఐ తరపున తొలిసారిగా బరిలోకి దిగిన బౌలర్ అశ్వనీ కుమార్ ఏకంగా 4 వికెట్లు తీసి కేకేఆర్ పతనాన్ని శాశించాడు. ఆరంగేట్ర మ్యాచులోనే నాలుగు వికెట్లు తీసి ఐపీఎల్‌ డెబ్యూలో ఇన్ని వికెట్లు తీసిన తొలి భారతీయ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అటు దీపక్ చహార్, ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యా కూడా రాణించడంతో కేకేఆర్ ఈ సీజన్‌లోనే అత్యల్ప స్కోరు నమోదు చేసింది. 16.2 ఓవర్లలో కేవలం 116 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. ఆ తరువాత బరిలోకి దిగిన ముంబై స్వల్ప ఛేదనను త్వరగానే పూర్తి చేసింది. రికల్టన్ దూకుడుతో కేవలం 12.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుని జయకేతనం ఎగుర వేసింది.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 01 , 2025 | 11:13 AM