ముంబై జట్టును కొనుగోలు చేసిన సారా
ABN, Publish Date - Apr 03 , 2025 | 02:32 AM
సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ క్రికెట్ వ్యాపారంలోకి ప్రవేశించింది. గ్లోబల్ ఈ-క్రికెట్ ప్రీమియర్ లీగ్ (జీఈపీఎల్)లో ముంబై ఫ్రాంచైజీని సారా...

ముంబై: సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ క్రికెట్ వ్యాపారంలోకి ప్రవేశించింది. గ్లోబల్ ఈ-క్రికెట్ ప్రీమియర్ లీగ్ (జీఈపీఎల్)లో ముంబై ఫ్రాంచైజీని సారా కొనుగోలు చేసింది. గతేడాదే మొదలైన ఈ లీగ్ విజయవంతమైంది. దీంతో ఇప్పుడు రెండో సీజన్‌లో కొత్త జట్లను ఆహ్వానించారు. ఇందులో భాగంగా ముంబై జట్టును సారా కొనుక్కుంది. జీఈపీఎల్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-క్రికెట్ లీగ్. రియల్ క్రికెట్-24 అనే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై లీగ్ జరుగుతుంది. లీగ్ ఫైనల్ ఈ ఏడాది మే నెలలో జరగనుంది.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Apr 03 , 2025 | 02:32 AM