ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Badminton : సెమీస్‌కు సాత్విక్‌ జోడీ

ABN, Publish Date - Jan 11 , 2025 | 05:37 AM

స్టార్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌/చిరాగ్‌ షెట్టి మలేసియా ఓపెన్‌ సూపర్‌ 1000 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో టైటిల్‌ దిశగా దూసుకెళ్తోంది.

కౌలాలంపూర్‌: స్టార్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌/చిరాగ్‌ షెట్టి మలేసియా ఓపెన్‌ సూపర్‌ 1000 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో టైటిల్‌ దిశగా దూసుకెళ్తోంది. ఏడోసీడ్‌గా బరిలోకి దిగిన భారత ద్వయం 26-24, 21-15తో స్థానిక ఫేవరెట్‌ జంట యే సిన్‌ ఓంగ్‌/ఎ యి తియోను చిత్తుచేసి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. 49 నిమిషాల ఈ పోరులో ప్రత్యర్థి నుంచి తొలి గేమ్‌లో ప్రతిఘటన ఎదుర్కొన్న సాత్విక్‌ జోడీ.. ఆ తర్వాత అద్భుతంగా పుంజుకొని అలవోకగా మ్యాచ్‌ను ముగించింది. గతేడాది ఇక్కడ రన్నర్‌పగా నిలిచిన సాత్విక్‌/చిరాగ్‌ జోడీ సెమీఫైనల్లో దక్షిణ కొరియాకు చెందిన వోన్‌ హో కిమ్‌/సెంగ్‌ జే సియోతో అమీతుమీ తేల్చుకోనుంది. కాగా, ఈ టోర్నీలో సెమీస్‌ చేరడం సాత్విక్‌ ద్వయానికిది వరుసగా మూడోసారి కావడం విశేషం.

Updated Date - Jan 11 , 2025 | 05:37 AM