సర్వీసెస్‌ ప్రపంచ రికార్డు ఛేదన

ABN, Publish Date - Feb 03 , 2025 | 05:26 AM

రంజీ ట్రోఫీ చరిత్రలోనే రెండో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా సర్వీసెస్‌ అరుదైన ఘనతను అందుకొంది. ఓపెనర్లు శుభమ్‌ రోహిల్లా (209 నాటౌట్‌), సూరజ్‌ వశిష్ఠ (154 నాటౌట్‌) అజేయ శతక జోరుతో.....

సర్వీసెస్‌ ప్రపంచ రికార్డు ఛేదన
  • నాలుగో ఇన్నింగ్స్‌లో 376 రన్స్‌ ఉఫ్‌

  • ఒడిశాపై సంచలన విజయం

కటక్‌: రంజీ ట్రోఫీ చరిత్రలోనే రెండో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా సర్వీసెస్‌ అరుదైన ఘనతను అందుకొంది. ఓపెనర్లు శుభమ్‌ రోహిల్లా (209 నాటౌట్‌), సూరజ్‌ వశిష్ఠ (154 నాటౌట్‌) అజేయ శతక జోరుతో.. గ్రూప్‌-ఎలో ఒడిశాతో జరిగిన మ్యాచ్‌లో సర్వీసెస్‌ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. గతేడాది త్రిపురతో మ్యాచ్‌లో రైల్వేస్‌ 378 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. కాగా, నాలుగో ఇన్నింగ్స్‌లో వశిష్ఠ, రోహిల్లా 376 పరుగుల అజేయ భాగస్వామ్యంతో.. వికెట్‌ నష్టపోకుండా నాలుగో ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు ఛేదించిన జట్టుగా సర్వీసెస్‌ ప్రపంచ రికార్డు సృష్టించింది. 376 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా ఆటకు ఆఖరి రోజైన ఆదివారం ఓవర్‌నైట్‌ స్కోరు 46/0తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన సర్వీసెస్‌ వికెట్‌ నష్టపోకుండా 376 పరుగులు చేసి విజయం సాధించింది. అయితే, గ్రూప్‌లో మూడో స్థానంతో నాకౌట్‌కు చేరుకోలేక పోయింది. బరోడాపై విజయంతో జమ్మూ కశ్మీర్‌ క్వార్టర్స్‌ బెర్త్‌ను ఖరారు చేసుకొంది.


Ind Vs Eng T20: ఇంగ్లండ్ వర్సెస్ ఇండియా టీ20.. అభిషేక్ శర్మ సరికొత్త రికార్డు

Updated Date - Feb 03 , 2025 | 05:26 AM