ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Smriti Mandhana : మంధానకు పగ్గాలు

ABN, Publish Date - Jan 07 , 2025 | 05:06 AM

ఐర్లాండ్‌తో జరిగే మూడు వన్డేల సిరీ్‌సకు భారత మహిళల జట్టు కెప్టెన్‌గా స్మృతీ మంధాన వ్యవహరించనుంది. 15 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ సోమవారం

హర్మన్‌, రేణుకలకు విశ్రాంతి

ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత మహిళల జట్టు

న్యూఢిల్లీ: ఐర్లాండ్‌తో జరిగే మూడు వన్డేల సిరీ్‌సకు భారత మహిళల జట్టు కెప్టెన్‌గా స్మృతీ మంధాన వ్యవహరించనుంది. 15 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ సోమవారం ప్రకటించింది. రాజ్‌కోట్‌లో ఈనెల 10,12,15వ తేదీల్లో మ్యాచ్‌లు జరుగనున్నాయి. అయితే రెగ్యులర్‌ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌తో పాటు పేసర్‌ రేణుకా సింగ్‌లకు పని ఒత్తిడి కారణంగా ఈ సిరీస్‌ నుంచి విశ్రాంతి కల్పించారు. విండీ్‌సతో జరిగిన టీ20 సిరీ్‌సలో గాయపడిన హర్మన్‌ చివరి రెండు మ్యాచ్‌లకు దూరమైంది. ఆ తర్వాత వన్డే సిరీస్‌లో మాత్రం ఆడింది. కొంతకాలంగా రేణుకా సింగ్‌ రెగ్యులర్‌గా క్రికెట్‌ ఆడుతోంది. మంధాన పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో వరుస అర్ధసెంచరీలు బాదేస్తూ భీకర ఫామ్‌లో ఉన్న సంగతి తెలిసిందే.

భారత జట్టు

స్మృతీ మంధాన (కెప్టెన్‌), దీప్తి శర్మ, ప్రతీక, హర్లీన్‌, జెమీమా, ఉమా చెత్రి, రిచా ఘోష్‌, తేజల్‌, రాఘవి, మిన్ను, ప్రియా మిశ్రా, తనూజ, టిటాస్‌, సైమా ఠాకూర్‌, సయాలి.

Updated Date - Jan 07 , 2025 | 05:06 AM