Womens Cricket Team : లంక మహిళలు అదరగొట్టారు
ABN, Publish Date - Mar 15 , 2025 | 01:24 AM
డు టీ20ల సిరీ్‌సలో భాగంగా శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో లంక 7 వికెట్ల తేడాతో కివీస్‌ను చిత్తుగా ఓడించింది.

కివీస్ గడ్డపై తొలి టీ20 గెలుపు
క్రైస్ట్‌చర్చ్: శ్రీలంక మహిళల క్రికెట్ జట్టు న్యూజిలాండ్ గడ్డపై అదరగొట్టింది. ఇక్కడ పొట్టి ఫార్మాట్‌లో ఆతిథ్య జట్టుపై తొలి విజయాన్ని నమోదుచేసింది. మూడు టీ20ల సిరీ్‌సలో భాగంగా శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో లంక 7 వికెట్ల తేడాతో కివీస్‌ను చిత్తుగా ఓడించింది. అరంగేట్ర బౌలర్, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ మల్కి మదార (3/14) సత్తా చాటడంతో.. మొదట కివీస్ 18.5 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది. కివీస్ బ్యాటర్లలో ఎమ్మా మెక్‌లాయిడ్ (44) టాప్ స్కోరర్.
కవిష దిల్హరి (2/18), ఇనోషి ప్రియదర్శని (2/25) చెరో రెండు వికెట్లు తీశారు. ఛేదనలో కెప్టెన్ చమరి ఆటపట్టు (64 నాటౌట్) అజేయ అర్ధసెంచరీతో చెలరేగడంతో లంక 14.1 ఓవర్లలో 102/3 స్కోరు చేసి గెలిచింది. ఓవరాల్‌గా టీ20ల్లో కివీ్‌సపై లంకకిది రెండో గెలుపు.
Updated Date - Mar 15 , 2025 | 01:24 AM