కౌర్‌కు స్వర్ణం.. ఇషాకు రజతం
ABN, Publish Date - Apr 06 , 2025 | 04:44 AM
భారత యువ షూటర్ స్విఫ్ట్ కౌర్, తెలంగాణ స్టార్ ఇషా సింగ్ ఐఎ్‌సఎ్‌సఎఫ్ వరల్డ్‌క్‌పలో పతకాలతో సత్తా చాటారు. మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్‌లో...

షూటింగ్ ప్రపంచ కప్
బ్యూనస్ ఎయిర్స్ (అర్జెంటీనా): భారత యువ షూటర్ స్విఫ్ట్ కౌర్, తెలంగాణ స్టార్ ఇషా సింగ్ ఐఎ్‌సఎ్‌సఎఫ్ వరల్డ్‌క్‌పలో పతకాలతో సత్తా చాటారు. మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్‌లో స్విఫ్ట్ కౌర్ స్వర్ణ పతకం కొల్లగొట్టింది. ఫైనల్లో కౌర్ ఫస్ట్ నీలింగ్ పొజిషన్‌లో అనిటా మ్యాన్‌గోల్డ్ (జర్మనీ) కంటే 7.2 పాయింట్లు వెనుకంజలో నిలిచినా.. ఆఖర్లో అదిరే ప్రదర్శన చేసింది. కౌర్ మొత్తం 458.6 పాయింట్లతో టాప్‌లో నిలిచింది. మ్యాన్‌గోల్డ్ రజతం, అరీనా అల్టుకొవా (కజకిస్థాన్) కాంస్యం దక్కించుకొన్నారు. ఇక, మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో ఇషా రజతం సాధించింది. ఫైనల్స్‌లో ఇషా 35 పాయింట్లతో రెండోస్థానంలో నిలవగా.. చైనా షూటర్లు యూజీ సన్ (38), సిజువాన్ ఫెంగ్ (30) వరుసగా స్వర్ణ, కాంస్య పతకాలను అందుకున్నారు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Apr 06 , 2025 | 04:44 AM