Team India Champions Trophy 2025: టీమిండియాకు ఇంత మేలు చేస్తారా? ఐసీసీపై పలువురు క్రికెటర్ల ఆగ్రహం..
ABN, Publish Date - Feb 25 , 2025 | 03:17 PM
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్‌తోనూ, పాకిస్తాన్‌తోనూ జరిగిన మ్యాచ్‌ల్లో టీమిండియా గెలుపొందింది. ఈ రెండు మ్యాచ్‌లూ దుబాయ్‌లోనే జరిగాయి. ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్‌లో జరుగుతుండగా, భద్రతా కారణాల రీత్యా ఆ దేశానికి వెళ్లడానికి టీమిండియా సిద్ధపడలేదు. దీంతో భారత్ ఆడే మ్యాచ్‌లను దుబాయ్‌లో నిర్వహిస్తున్నారు.
ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025)లో టీమిండియా దూకుడు ప్రదర్శిస్తోంది. ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి సత్తా చాటింది. బంగ్లాదేశ్‌తోనూ, పాకిస్తాన్‌తోనూ జరిగిన మ్యాచ్‌ల్లో గెలుపొందింది. ఈ రెండు మ్యాచ్‌లూ దుబాయ్ (Dubai Stadiaum)లోనే జరిగాయి. ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్ (Pakistan)లో జరుగుతుండగా, భద్రతా కారణాల రీత్యా ఆ దేశానికి వెళ్లడానికి టీమిండియా సిద్ధపడలేదు. దీంతో భారత్ ఆడే మ్యాచ్‌లను దుబాయ్‌లో నిర్వహిస్తున్నారు. భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్ వేదికగానే జరుగుతాయి. ఇదే టీమిండియాకు అడ్వాంటేజ్ అని పలువురు క్రికెటర్లు వ్యాఖ్యానిస్తున్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఒకే వేదికలో మ్యాచ్‌లు ఆడుతుండడం కచ్చితంగా ఆ జట్టుకు కలిసొస్తుందని ఆస్ట్రేలియా ఆటగాడు ప్యాట్ కమిన్స్ (Pat Cummins), ఇంగ్లండ్ మాజీ ఆటగాళ్లు మైకేల్ అథర్టన్, నాజీర్ హుస్సేన్ అభిప్రాయపడ్డారు. ``ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే జట్లన్నీ రకరకాల వేదికల్లో ఆడుతున్నాయి. మ్యాచ్‌ల మధ్యలో ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. కొత్త పరిస్థితులకు అలవాటు పడాల్సి ఉంటుంది. భారత్‌కు ఆ సమస్య లేదు. టోర్నీ మొత్తం ఒకే వేదికలో ఆడుతుంది. ఒకే మైదానంలో ఆడితే అక్కడి పరిస్థితులు, పిచ్ స్పందించే తీరుపై మెరుగైన అవగాహన ఉంటుంద``ని అథర్టన్ వ్యాఖ్యానించాడు.
ఒకే వేదికలో మ్యాచ్‌లు ఆడడం కచ్చితంగా కలిసొచ్చే విషయమేనని, టీమిండియాకు అదే పెద్ద అడ్వాంటేజ్ అని నాజీర్ హుస్సేన్ కూడా అభిప్రాయపడ్డాడు. ``దుబాయ్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందనే భావనతో టీమిండియా ఎక్కువ మంది స్పిన్నర్లను తీసుకుంది. కానీ, రకరకాల మైదానాల్లో ఆడే ఇతర జట్లకు అలాంటి స్థిరమైన తుది జట్టు కూర్పు కుదరద``ని నాజీర్ హుస్సేన్ అన్నాడు. ``టీమిండియా చాలా బలమైన జట్టు. అలాంటి జట్టుకే ఒకే వేదికను ఇవ్వడం మాత్రం తప్పు. టీమిండియా విషయంలో ఐసీసీ పక్షపాతంతో వ్యవహరించింద``ని ప్యాట్ కమిన్స్ విమర్శించాడు.
ఇవి కూడా చదవండి..
Virat Kohli: కోహ్లీ ఇలా చేసుండాల్సింది కాదు.. పాక్ మహిళా అభిమాని ఆవేదన వింటే.. వీడియో వైరల్..!
మరిన్ని క్రీడా వార్తలు కోెసం క్లిక్ చేయండి..
Updated Date - Feb 25 , 2025 | 03:17 PM