భారత షట్లర్లకు క్లిష్టమైన డ్రా
ABN, Publish Date - Mar 26 , 2025 | 03:19 AM
వచ్చేనెల 8 నుంచి 13 వరకు ఇక్కడ జరిగే ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ వ్యక్తిగత విభాగం పోటీల్లో భారత షట్లర్లకు క్లిష్టమైన డ్రా ఎదురైంది. పురుషుల సింగిల్స్ ఆరంభ రౌండ్లో లక్ష్య సేన్..

ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్
నింగ్బో (చైనా): వచ్చేనెల 8 నుంచి 13 వరకు ఇక్కడ జరిగే ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ వ్యక్తిగత విభాగం పోటీల్లో భారత షట్లర్లకు క్లిష్టమైన డ్రా ఎదురైంది. పురుషుల సింగిల్స్ ఆరంభ రౌండ్లో లక్ష్య సేన్.. ఈ ఏడాది ఆల్‌ఇంగ్లండ్ ఓపెన్ ఫైనలిస్టు లీ చియా చావో (చైనీస్ తైపీ)తో తలపడనున్నాడు. ఇక, గువాంగ్ జూ లూ (చైనా)తో హెచ్‌ఎస్ ప్రణయ్, కంటఫాన్ వాంగ్‌చరోన్ (థాయ్‌లాండ్)తో ప్రియాన్షు రజావత్, క్వాలిఫయర్‌తో కిరణ్ జార్జ్ తొలి రౌండ్ ఆడనున్నారు. మహిళల సింగిల్స్ మొదటి రౌండ్లో ఈస్తర్ నురుమి (ఇండోనేసియా)తో పీవీ సింధు, మాజీ ప్రపంచ చాంపియన్ ఇంటనాన్ రచానోక్ (థాయ్‌లాండ్)తో అనుపమ, ఫాంగ్ జి గావో (చైనా)తో మాళవిక అమీతుమీ తేల్చుకోనున్నారు. మహిళల డబుల్స్‌లో క్వాలిఫయర్ జంటతో గాయత్రి/ట్రీసా జాలీ జోడీ తమ పోరు ఆరంభించనుంది.
ఇవి కూడా చదవండి..
Dhanashree-Ritika: ఛాహల్ మాజీ భార్యపై జర్నలిస్ట్ విమర్శ.. లైక్ కొట్టిన రోహిత్ భార్య రితిక
Vignesh puthur: విఘ్నేష్ పుత్తుర్.. ఆటో డ్రైవర్ కొడుకుతో ధోనీ ఏం మాట్లాడాడంటే..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Mar 26 , 2025 | 03:19 AM