ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వచ్చే వరల్డ్‌కప్‌ ఆడతా..

ABN, Publish Date - Apr 02 , 2025 | 04:44 AM

విరాట్‌ కోహ్లీ తన భవిష్యత్‌ ప్రణాళికలను వెల్లడించాడు. దీంట్లో భాగంగా 2027లో జరిగే వన్డే వరల్డ్‌క్‌పలోనూ ఆడాలనుకుంటున్నట్టు తేల్చాడు....

న్యూఢిల్లీ: విరాట్‌ కోహ్లీ తన భవిష్యత్‌ ప్రణాళికలను వెల్లడించాడు. దీంట్లో భాగంగా 2027లో జరిగే వన్డే వరల్డ్‌క్‌పలోనూ ఆడాలనుకుంటున్నట్టు తేల్చాడు. చాంపియన్స్‌ ట్రోఫీలో భారత జట్టు విజేతగా నిలిచాక రోహిత్‌, విరాట్‌ వన్డే కెరీర్‌పై సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ ఈ ఫార్మాట్‌ నుంచి ఇప్పట్లో తప్పుకొనే ఆలోచన లేదని ముంబైలో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో విరాట్‌ తెలిపాడు. రాబోయే వన్డే వరల్డ్‌కప్‌ గెలుచుకునేందుకు ప్రయత్నించడమే తన ముందున్న పెద్ద లక్ష్యంగా స్పష్టం చేశాడు. గతేడాది టీ20 వరల్డ్‌కప్‌ గెలిచాక రోహిత్‌, విరాట్‌, జడేజాలు ఆ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 02 , 2025 | 04:44 AM