Virat Kohli: విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి యాడ్స్, ప్రమోషన్స్ తొలగింపు.. కారణం ఏంటి
ABN , Publish Date - Apr 09 , 2025 | 06:20 PM
విరాట్ కోహ్లీ బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్, ప్రమోషన్స్ ద్వారా కోట్లలో సంపాదిస్తుంటాడు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో బ్రాండ్ ప్రమోషన్స్ ద్వారా కోట్లు ఆర్జిస్తున్నాడు. కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నిండా అలాంటి బ్రాండ్ ప్రమోషన్స్‌కు సంబంధించిన పోస్ట్‌లు ఎక్కువగా కనబడుతుంటాయి.

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) బ్రాండ్ ప్రమోషన్స్‌లో కూడా రారాజు. బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్, ప్రమోషన్స్ ద్వారా కోట్లలో సంపాదిస్తుంటాడు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో బ్రాండ్ ప్రమోషన్స్ ద్వారా కోట్లు ఆర్జిస్తున్నాడు. కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నిండా అలాంటి బ్రాండ్ ప్రమోషన్స్‌కు సంబంధించిన పోస్ట్‌లు (Promotional Posts) ఎక్కువగా కనబడుతుంటాయి. అయితే ఉన్నట్టుండి అవన్నీ మాయమయ్యాయి. కోట్లు తెచ్చిపెట్టే యాడ్స్, ప్రమోషనల్ పోస్ట్‌లను కోహ్లీ ఉన్నట్టుండి ఎందుకు తొలగించాడో తెలియక అందరూ అయోమయానికి గురవుతున్నారు (Virat Kohli Instagram).
ఇలా యాడ్స్, ప్రమోషనల్ పోస్ట్‌లను కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి తొలగించడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కోహ్లీ బ్రాండ్ ప్రమోషన్లు చేయడం మానేశాడా అంటూ చాలా మంది సోషల్ మీడియా జనాలు కామెంట్లు చేస్తున్నారు. అయితే నిజం ఏంటంటే.. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఆకర్షణీయంగా మార్చడానికి కోహ్లీ ఇలా చేశాడు. తన ప్రమోషనల్ ఫీడ్ అంతటినీ రీల్స్ విభాగానికి తరలించాడు. అంతే తప్ప బ్రాండ్ ప్రమోషన్లు చేయడాన్ని కోహ్లీ మానలేదు.
కాగా, ప్రస్తుత ఐపీఎల్‌లో కోహ్లీ సత్తా చాటుతున్నాడు. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ మొత్తం 164 పరుగులు చేశాడు. ఇటీవల వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 42 బంతుల్లో 67 పరుగులు చేసి భారీ స్కోరుకు బాటలు వేశాడు. ఆ మ్యాచ్‌లో ముంబై 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..