బుమ్రా సంగతేంటి?
ABN, Publish Date - Jan 10 , 2025 | 03:41 AM
ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీలో భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ప్రాతినిధ్యంపై సస్పెన్స్ కొనసాగుతోంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో విశేషంగా రాణించిన అతడు సిడ్నీ టెస్టులో గాయపడిన విషయం తెలిసిందే. దీంతో...
న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీలో భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ప్రాతినిధ్యంపై సస్పెన్స్ కొనసాగుతోంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో విశేషంగా రాణించిన అతడు సిడ్నీ టెస్టులో గాయపడిన విషయం తెలిసిందే. దీంతో ముందు జాగ్రత్తగా ఇంగ్లండ్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీ్‌సల్లో విశ్రాంతినిస్తారని భావిస్తున్నారు. కానీ వచ్చే నెల 19 నుంచి పాక్, దుబాయ్‌లో చాంపియన్స్ ట్రోఫీ జరుగబోతోంది. ఈ మెగా టోర్నీకి బుమ్రా అందుబాటులో ఉంటాడా? లేడా? అనేది ఉత్కంఠగా మారింది. ఈ ఆదివారం లోపు టీమిండియా ప్రాథమిక జట్టును ప్రకటించాల్సి ఉంది. ఈ జట్టులో ఎలాగూ మార్పులు చేసుకునే సౌలభ్యం ఉండడంతో 15 మందితో కూడిన టీమ్‌లో బుమ్రా పేరును చేర్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇక టోర్నీ ఆరంభం నాటికి అతను పూర్తి ఫిట్‌నెస్ సాధించి బౌలింగ్ చేయగలిగితే.. తుది జట్టులో ఉంటాడు. ప్రస్తుతానికైతే బుమ్రా గాయం తీవ్రతపై బీసీసీఐ ఎలాంటి ప్రకటనా చేయలేదు.
ఒకవేళ అతడి గాయం గ్రేడ్ 3 విభాగంలో ఉంటే మాత్రం కోలుకునేందుకు మూడు నెలల సమయం పడుతుంది. అదే జరిగితే ఇంగ్లండ్‌తో సిరీ్‌సలతోపాటు చాంపియన్స్ ట్రోఫీ, ఐపీఎల్‌లో ఆడేది కూడా సందేహంగా మారుతుం ది. ఈనేపథ్యంలో భారత బౌలింగ్ విభాగం బలహీనంగా మారుతుంది.
Updated Date - Jan 10 , 2025 | 03:42 AM