అమ్మాయిలూ... అదరగొట్టండి!
ABN, Publish Date - Jan 10 , 2025 | 03:37 AM
వెస్టిండీస్ సిరీ్‌సలో అదరగొట్టిన భారత మహిళల జట్టు.. అదే జోరును కొనసాగించాలనుకొంటోంది. ఐర్లాండ్‌తో తొలి ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా.. శుక్రవారం జరగనున్న మొదటి వన్డేలో డాషింగ్ బ్యాటర్ స్మృతి మంధాన నేతృత్వంలో...
ఉ. 11 నుంచి స్పోర్ట్స్-18లో
మంధాన కెప్టెన్సీలో దూకుడుగా భారత్
ఐర్లాండ్‌తో తొలి వన్డే నేడు
రాజ్‌కోట్: వెస్టిండీస్ సిరీ్‌సలో అదరగొట్టిన భారత మహిళల జట్టు.. అదే జోరును కొనసాగించాలనుకొంటోంది. ఐర్లాండ్‌తో తొలి ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా.. శుక్రవారం జరగనున్న మొదటి వన్డేలో డాషింగ్ బ్యాటర్ స్మృతి మంధాన నేతృత్వంలో భారత్ బరిలోకి దిగనుంది. వరల్డ్‌కప్ నేపథ్యంలో యువ క్రికెటర్లను పరీక్షించడానికి మేనేజ్‌మెంట్‌కు ఇదో సువర్ణావకాశం. విండీ్‌సతో టీ20 సిరీ్‌సను 2-1తో సొంతం చేసుకొన్న భారత్.. వన్డే సిరీ్‌సను 3-0తో దక్కించుకొంది. ఈ రెండు ఫార్మాట్లలోనూ పరుగుల వరద పారించిన మంధాన అదే ఫామ్‌ను కొనసాగించాలనుకొంటోంది. హర్మన్‌ప్రీత్ కౌర్‌కు విశ్రాంతినివ్వడంతో.. మిడిలార్డర్‌లో హర్లీన్ డియోల్, ప్రతీక, జెమీమా కీలకంగా మారారు. విండీ్‌సతో వన్డే సిరీ్‌సలో డియోల్ సెంచరీ నమోదు చేసింది. ఓపెనర్‌గా ప్రతీక మెరుగ్గా రాణిస్తోంది. అయితే, పేసర్ రేణుకా సింగ్ గైర్హాజరీలో టిటాస్ సాధు, సైమా ఠాకూర్‌పై భారం పడనుంది.
దీప్తి శర్మ, ప్రియా మిశ్రా, తనూజ కన్వర్‌తో స్పిన్ విభాగం బలంగానే ఉంది. ఆల్‌రౌండర్లు రాఘవి బిస్త్, సయాలిపై అందరి దృష్టి ఉండే అవకాశం ఉంది. మరోవైపు గాబీ లూయిస్ సారథ్యంలో బరిలోకి దిగుతున్న ఐర్లాండ్‌కు భారత్‌ను ఎదుర్కోవడం సవాలే. ఈ రెండు జట్లు వన్డేల్లో 12 సార్లు తలపడగా ఐర్లాండ్ ఒక్కసారి కూడా గెలవలేదు. అయితే, ఈసారి గెలిచి సత్తాచాటుతామని గాబీ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తోంది. ఆల్‌రౌండర్ ఓర్లా పెండర్‌గా్‌స్టకు బిగ్‌బా్‌షలో ఆడిన అనుభవం ఉంది.
Updated Date - Jan 10 , 2025 | 03:37 AM