విశాఖలో మహిళల వన్డే వరల్డ్‌కప్‌ మ్యాచ్‌

ABN, Publish Date - Mar 23 , 2025 | 03:47 AM

వచ్చే సెప్టెంబరులో భారత్‌ ఆతిథ్యమిచ్చే ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్‌ తొలి మ్యాచ్‌ విశాఖపట్నంలో నిర్వహించనున్నామని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా వెల్లడించాడు...

విశాఖలో మహిళల వన్డే వరల్డ్‌కప్‌ మ్యాచ్‌

సాగరతీరంలో డిసెంబరులో

దక్షిణాఫ్రికాతో పురుషుల వన్డే

ముంబై: వచ్చే సెప్టెంబరులో భారత్‌ ఆతిథ్యమిచ్చే ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్‌ తొలి మ్యాచ్‌ విశాఖపట్నంలో నిర్వహించనున్నామని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా వెల్లడించాడు. విశాఖతోపాటు గువాహటి, ములన్‌పూర్‌ (పంజాబ్‌), తిరువనంతపురం, ఇండోర్‌లో టోర్నీ జరగనుంది. అలాగే పన్నెండేళ్ల తర్వాత వెస్టిండీస్‌ పురుషుల జట్టు టెస్టు సిరీస్‌ ఆడేందుకు భారత్‌ రానుంది. అక్టోబరులో విండీ్‌సతో 2 టెస్టులు, నవంబరు-డిసెంబరులో దక్షిణాఫ్రికాతో 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20లను స్వదేశంలో భారత్‌ ఆడనుంది. డిసెంబరు 6న విశాఖలో మూడో వన్డే జరగనుంది.

ఇవి కూడా చదవండి..

IPL 2025: విరాట్‌తో, షారూక్ ఖాన్ డ్యాన్స్.. కింగ్ కోహ్లీ డ్యాన్స్ చూస్తే

IPL 2025: బిగ్‌ స్క్రీన్‌పై ఐపీఎల్.. బీసీసీఐతో పీవీఆర్ ఒప్పందం..

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 23 , 2025 | 03:47 AM