వావ్.. వైశాలి
ABN, Publish Date - Jan 01 , 2025 | 06:39 AM
ప్రపంచ బ్లిట్జ్ చెస్ చాంపియన్‌షి్‌ప మహిళల విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్.వైశాలి అదరగొడుతోంది. అనూహ్య ఆటతీరుతో అజేయంగా దూసుకెళ్తున్న ఈ తమిళనాడు క్రీడాకారిణి 9.5 పాయింట్లతో క్వార్టర్‌ఫైనల్స్‌కు చేరుకుంది...
అజేయంగా క్వార్టర్స్‌లోకి
అర్జున్, ప్రజ్ఞానంద, హంపిలకు నిరాశ
వరల్డ్ బ్లిట్జ్ చెస్
న్యూయార్క్: ప్రపంచ బ్లిట్జ్ చెస్ చాంపియన్‌షి్‌ప మహిళల విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్.వైశాలి అదరగొడుతోంది. అనూహ్య ఆటతీరుతో అజేయంగా దూసుకెళ్తున్న ఈ తమిళనాడు క్రీడాకారిణి 9.5 పాయింట్లతో క్వార్టర్‌ఫైనల్స్‌కు చేరుకుంది. దీంతో తాజా టోర్నీలో నాకౌట్‌లో అడుగుపెట్టిన ఏకైక భారత ప్లేయర్‌గా నిలిచిన వైశాలి.. 2024లో గుకేశ్, హంపి తర్వాత మరో వరల్డ్ చాంపియన్‌గా రికార్డులకెక్కాలనుకుంటోంది. తొలి దశలో ఆడిన 11 రౌండ్లలో 8 విజయాలు, మూడు డ్రాలతో వైశాలి టాప్‌లో ఉంది. సెమీ్‌సలో చోటు కోసం 23 ఏళ్ల వైశాలి ఝు జినెర్ (చైనా)తో తలపడనుంది. టోర్నీలో వైశాలి మినహా భారత ఆటగాళ్ల పోరాటం ముగిసింది. టాప్-8 మాత్రమే క్వార్టర్స్‌కు వెళ్లనుండగా, 8 పాయింట్లతో హంపి తొమ్మిదో స్థానంలో నిలిచింది. దివ్య, వంతిక కూడా నిరాశపరిచారు.
ఇక ఓపెన్ విభాగంలోనూ వైశాలి సోదరుడు ప్రజ్ఞానంద (8.5) 23వ స్థానంలో, అర్జున్ ఇరిగేసి (7) 64వ స్థానంలో, ప్రణవ్ (7) 67వ స్థానంలో నిలిచి నిష్క్రమించారు.
Updated Date - Jan 01 , 2025 | 06:39 AM