ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నేలపై ఇంద్రధనస్సు

ABN, Publish Date - Jan 06 , 2025 | 02:22 AM

జిల్లా కేంద్రంలోని వాణీనికేతన్‌ పాఠశాల ఆవరణలో ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ముత్యాలముగ్గుల పోటీకి విశేష స్పందన లభించింది.

- ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ ముత్యాల ముగ్గుల పోటీకి విశేష స్పందన

- ఉత్సాహంగా పాల్గొని ముగ్గులు వేసిన మహిళలు, యువతులు

కరీంనగర్‌ కల్చరల్‌, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని వాణీనికేతన్‌ పాఠశాల ఆవరణలో ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ముత్యాలముగ్గుల పోటీకి విశేష స్పందన లభించింది. ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌ నిర్వహణలో రాష్ట్ర స్థాయి ప్రధాన స్పాన్సర్‌గా సంతూర్‌, కో స్పాన్సర్స్‌గా గార్డెనింగ్‌ పార్టనర్‌గా క్రాప్ట్‌ వారి ఫర్‌ఫెక్ట్‌, ప్యాషన్‌ పార్టనర్‌ డిగ్‌సెల్‌ వారి సెల్సియా (ట్రెండీ మహిళల ఇన్నర్‌వేర్‌) సంస్థలు, స్థానిక జిల్లా స్పాన్సర్‌గా టవర్‌ సర్కిల్‌లోని వర్ష జువెల్లర్స్‌ వ్యవహరించాయి. ఉదయం 10.30కు పోటీలు ప్రారంభించారు. జిల్లా కేంద్రంతోపాటు పలు ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు, యువతులు, విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 50 మంది మహిళలు ముగ్గులు వేశారు. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా జిల్లా సంక్షేమ శాఖాధికారి కె సబిత, జిల్లా వ్యవసాయ శాఖాధికారి భాగ్యలక్ష్మి, గంగాధర సీపిడీవో ఎం కస్తూరి హాజరై విజేతలను ఎంపిక చేశారు. జిల్లా స్పాన్సర్‌ టవర్‌ సర్కిల్‌లోని వర్ష జువెల్లర్స్‌ అధినేత యెలగందుల వీరేశం హాజరై అతిథులందరితో కలసి ముగ్గురికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతోపాటు పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ పార్టిసిపేషన్‌ బహుమతులను అందించారు. కిసాన్‌నగర్‌కు చెందిన కొక్కొండ లహరి ప్రథమ బహుమతి గెలుచుకోగా ఆమెకు ఆరు వేల రూపాయల బహుమతిని అందజేశారు. ద్వితీయ స్థానంలో నిలిచిన విద్యానగర్‌కు చెందిన దుర్గం రేణుకకు నాలుగు వేల రూపాయలు, తృతీయస్థానంలో నిలిచిన కోతిరాంపూర్‌కు చెందిన సత్రం సరితకు మూడు వేల రూపాయలు అందుకున్నారు. మిగిలిన 47 మందికి పార్టిసిపేషన్‌ బహుమతులను అందజేశారు. లోగో ముగ్గులు వేసిన ఎం స్రవంతి, హర్బియా, ఇ సాత్విక్‌లక్ష్మికి బహుమతులు అందజేశారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌ బ్రాంచి మేనేజర్‌ కల్లెపు సంపత్‌రెడ్డి మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో 22 సంవత్సరాలుగా ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. స్పాన్సర్స్‌కు, న్యాయనిర్ణేతలకు, నిర్వహణకు సహకరించిన వాణీనికేతన్‌ యాజమాన్యానికి, సిబ్బందికి, వ్యయ ప్రయాసలకోర్చి ఉత్సాహంగా పాల్గొని తమ నైపుణ్యాన్ని ముగ్గుల రూపంలో ప్రదర్శించిన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. న్యాయ నిర్ణేతలు కె సబిత, భాగ్యలక్ష్మి, ఎం కస్తూరి మాట్లాడుతూ రంగుల ముగ్గుల శోభతో పండుగ కళ కనిపిస్తోందని అన్నారు. సంస్కృతీ సాంప్రదాయాలు, పలు అంశాలు, పండుగ విశిష్ఠతను తెలిపే ప్రస్ఫుటంగా ప్రతిబింబించే విధంగా ముగ్గులు వేశారని అభినందించారు. కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. బ్యూరో చీఫ్‌ నగునూరి శేఖర్‌ మాట్లాడుతూ మహిళలందరూ ఉత్సాహంగా పాల్గొన్నారని, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి నిస్పక్షపాతంగా, నిర్భయంగా సమాజానికి నిజమైన వార్తలందించడంతో పాటు సంస్కృతీ సంప్రదాయాలను గౌరవిస్తూ ముగ్గుల పోటీలను నిర్వహిస్తోందన్నారు. పోటీల్లో పాల్గొనడమే ప్రధాన ధ్యేయమని, నిజానికి ఇందులో అందరూ విజేతలేనని భావించాలని తెలిపారు. కార్యక్రమంలో ఎడిషన్‌ ఇన్‌చార్జి పరుచూరి జయంత్‌రావు, అసిస్టెంట్‌ మేనేజర్‌ నూగూరి శ్రావణ్‌ కుమార్‌ (ఏడీవీటీ), ఏసిఎం వర్ధినేని పాపారావు, ఏబీఎన్‌ స్టాఫ్‌ రిపోర్టర్‌ సందెవేని శ్రీనివాస్‌, డెస్క్‌ ఇన్‌చార్జి గర్రెపల్లి సురేందర్‌గౌడ్‌, సబ్‌ ఎడిటర్‌ జి జీవన్‌రెడ్డి, ఏవోలు ఎ మునీశ్వర్‌, ఎం కుమార్‌, అకౌటెంట్‌ పి సంతోష్‌, స్టోర్‌ అసిస్టెంట్‌ బి వెంకటమల్లు, ఏసీవోలు ఇ రమేశ్‌, ఆర్‌ శ్రీనివాస్‌, స్టాఫ్‌ ఫోటోగ్రాఫర్‌ ఎండీ షుకూర్‌, రిపోర్టర్లు అయిలేని సురేందర్‌రెడ్డి, బిట్ల లక్ష్మణ్‌, పరాంకుశం మనోహర్‌, డి రాజారాంమోహన్‌, దామరపెల్లి రాజేందర్‌, వంగపల్లి సూర్యప్రకాశ్‌ పాల్గొన్నారు.

ఫ సంతోషంగా ఉంది....

- కొక్కొండ లహరి, కిసాన్‌నగర్‌, ప్రథమ బహుమతి

ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌ ముగ్గుల పోటీల్లో విజేతగా నిలవడం చాలా సంతోషంగా ఉంది. ఆంధ్రజ్యోతి ఎప్పటికీ ఇలాగే ముగ్గుల పోటీ నిర్వహించాలని కోరుకుంటున్నా.

ఫ నాకంటూ ఓ గుర్తింపు వచ్చింది

- దుర్గం రేణుక, విద్యానగర్‌, ద్వితీయ బహుమతి

అందరికీ ముందస్తు సంక్రాంతి పండగ శుభాకాంక్షలు. 18 సంవత్సరాలుగా ఆంధ్రజ్యోతి ముగ్గుల పోటీల్లో పాల్గొంటున్నా. బహుమతులు గెలుస్తుండంతో నా కంటూ ఓ గుర్తింపు వచ్చింది. ఎక్కడికెళ్లినా మీరు ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ముగ్గుల పోటీల్లో ముగ్గు వేశారు కదా అంటారు. చాలా సంతోషంగా ఉంది.

ఫ ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతికి కృతజ్ఞతలు

- తృతీయ బహుమతి విజేత, సత్రం సరిత, కోతిరాంపూర్‌

సంక్రాంతి పండగంటే నాకు ఇష్టం. ఎక్కడెక్కడో ఉన్న కుటుంబ సభ్యులంతా ఒక్క చోట చేరి పండుగ జరుపుకుంటారు. ముగ్గులు, వేడుకలతో, రైతుల ధాన్యాలతో పండుగ సంతోషంగా జరుపుకుంటారు. పోటీలు నిర్వహించిన ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతికి కృతజ్ఞతలు.

Updated Date - Jan 06 , 2025 | 02:22 AM