ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు

ABN, Publish Date - Jan 08 , 2025 | 01:03 AM

ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ వి ప్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు.

సమీక్ష నిర్వహిస్తున్న ప్రభుత్వ విప్‌ లక్ష్మణ్‌ కుమార్‌

ప్రభుత్వ విప్‌ లక్ష్మణ్‌ కుమార్‌

ముక్కోటి ఉత్సవాలపై అధికారులతో సమీక్ష

ధర్మపురి, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ వి ప్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. మంగళవారం ధర్మపురిలోని లక్ష్మీ నృ సింహస్వామి ఆలయంలో గల ఈవో కార్యాలయంలో వివిధ మండల స్థా యి అధికారులతో ముక్కోటి ఏకాదశి పర్వదినం ఏర్పాట్లపై నిర్వహించిన స మీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సమావేశానికి ముందు ఆలయం లో చేపడుతున్న ఏర్పాట్లను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. అ నంతరం ఆలయం ఆవరణలో ఏర్పాటు చేసిన వివిర రకాల పూజలు, శాశ్వ త పూజలు, అన్నదానం సంబందించిన టిక్కెట్ల కౌంటర్లను ఆయన ప్రారం భించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి పర్వదినం సం దర్భంగా దైవ దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గత యేడాది ఏమైనా లోపా లు జరిగి ఉంటే వాటిని సమీక్షించుకుంటూ తిరిగి పునరావృత్తం కాకుండా చ ర్యలు తీసుకోవాలన్నారు. వేద పండితులు, అర్చకుల సూచనల మేరకు స మయపాలనకు అనుగుణంగా వైకుంఠ ద్వారాన్ని తెరిచి ఉంచాలన్నారు. దేవా లయం వెనుక వైపు నుంచి భక్తుల కోసం క్యూలైన్‌, ప్రత్యేక క్యూ లైన్‌, గోదా వరి నది వద్ద ప్రత్యేక పారిశుధ్యం ఇతర అవసరాల ఏర్పాటు గురించి పరి శీలించి అధికారులకు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఆలయానికి చ్చే భక్తులకు పూర్తి సమాచారం ఇచ్చేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వరదవెల్లి పీచర శ్రీహర్ష సహకారంతో రూ. 1.25 లక్షలతో ఏర్పాటు చేసిన విచారణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సమావేశంలో ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్‌, తహసీల్ధార్‌ కృష్ణ చైతన్య, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సంగి స త్తమ్మ, కమిషనర్‌ కందుకూరి శ్రీనివాస్‌, సీఐ రాంనర్సింహారెడ్డి, ఎస్‌ఐ ఉద య్‌ కుమార్‌, ట్రాన్స్‌కో ఏఈ రవి, వైస్‌ చైర్మన్‌ రామయ్య, వేద పండితులు రమేశ్‌, ఉప ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు, ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాసా చారి, సూపరింటెండెంట్‌ కిరన్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ అలువాల శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 08 , 2025 | 01:04 AM