Share News

బాధితులకు అండగా భరోసా సెంటర్‌

ABN , Publish Date - Mar 17 , 2025 | 11:26 PM

బాధితులకు అండగా జిల్లా భరోసా సెంటర్‌ సేవలు అందిస్తుందని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు.

బాధితులకు అండగా భరోసా సెంటర్‌
అర్జీలు స్వీకరిస్తున్న ఎస్పీ డీవీ శ్రీనివాసరావు

- ఎస్పీ డీవీ శ్రీనివాసరావు

ఆసిఫాబాద్‌, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): బాధితులకు అండగా జిల్లా భరోసా సెంటర్‌ సేవలు అందిస్తుందని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. సోమవారం ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌ ద్వారా వచ్చిన విక్టమ్‌ అసిస్టెంట్‌ ఫండ్‌ను బాధిత మహిళలైన ఆరుగురికి ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున రూ.60 వేల చెక్కులను జిల్లా పోలీసు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసుల్లో బాధిత మహిళలకు కౌన్సెలింగ్‌ ఇవ్వడం జరు గుతుందని, మెడికల్‌ ఎగ్జామినేషన్‌లో కూడా బాధితులకు అండగా ఉంటామని తెలిపారు. భరోసా ఆధ్వర్యంలో వివిధ పాఠశాలల్లో అవగా హన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. పోలీసు సేవలు, కౌన్సెలింగ్‌, వైద్య, న్యాయసేవ లు అందిస్తామన్నారు. భరోసా సెంటర్‌ సిబ్బం ది వివిధ ప్రాంతాల్లో మహిళలకు, చిన్న పిల్లలు బాధింపబడినట్లయితే తీసుకోవాల్సిన చర్యల గు రించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తార న్నారు. బాధితులు 8712670561 నంబర్‌కు లేదా 100 ద్వారా భరోసా కేంద్రాన్ని సంప్రదించ వచ్చని సూచించారు. క్యాక్రమంలో భరోసా సెంటర్‌ ఇన్‌చార్జి మహిళా ఎస్సై తిరుమల, లీగల్‌ సపోర్టర్‌ పర్సన్‌ శైలజ, డీసీఆర్బీ డీఎస్సీ కరుణాకర్‌, స్పెషల్‌ బ్రాంచి ఇన్స్‌పెక్టర్‌ రాణా ప్రతాప్‌, డీసీఆర్బీ ఇన్స్‌పెక్టర్‌ శ్రీధర్‌, ఆర్‌ఐ పెద్దన్న, సీసీకిరణ్‌లు పాల్గొన్నారు.

- ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ

జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో ఎస్పీ డీవీ శ్రీనివాస్‌రావు ప్రజావాణి కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫిర్యాదుదారుల నుంచి అర్జీలు స్వీకరించి వాటి ని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత స్టేషన్ల ఎస్సైలు, సీఐలకు ఫోన్‌ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని, పరిష్కారానికి సూచనలు చేశారు. ప్రజలు నిర్భయంగా ఎలాంటి పైరవీ లు లేకుండా స్వచ్ఛందగా పోలీసు సేవల్ని విని యోగించుకోవాలని సూచించారు. వారివారి సమస్యలు చట్టప్రకారం పరిష్కరించుకునేలా పోలీసులు సహకరిస్తారని తెలిపారు. ప్రజలకు మరింత దగ్గరయ్యేలా శాంతి భద్రతలు పరిష్క రిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీసు శాఖ పని చేస్తుందని అన్నారు. ప్రతీ సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా అర్జీలు స్వీకరించి సమస్యలు పరిష్కరిస్తున్నామ ని ఎస్పీ తెలిపారు.

Updated Date - Mar 17 , 2025 | 11:26 PM