విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీయాలి
ABN, Publish Date - Mar 13 , 2025 | 11:53 PM
విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసి వారిని ప్రోత్సహించాలని తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ డివిజనల్ మేనేజర్ శ్రావణి పేర్కొన్నారు. గురువారం కుందారంలోని జిల్లా పరిసత్ ఉన్నత పాఠశా లలో ఆర్ట్ అండ్‌క్రాప్ట్ ప్రదర్శనను ఆమె ప్రా రంభించి మాట్లాడారు.
తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ డివిజనల్ మేనేజర్ శ్రావణి
జైపూర్, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసి వారిని ప్రోత్సహించాలని తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ డివిజనల్ మేనేజర్ శ్రావణి పేర్కొన్నారు. గురువారం కుందారంలోని జిల్లా పరిసత్ ఉన్నత పాఠశా లలో ఆర్ట్ అండ్‌క్రాప్ట్ ప్రదర్శనను ఆమె ప్రా రంభించి మాట్లాడారు. విద్యార్ధి దశ నుంచే స్వీయ క్రమ శిక్షణ కలిగి ఉంటే ఏ రంగం లోనైనా రాణించవచ్చన్నారు. గత సంవత్సరం టీజీఎఫ్‌డీసీ ఆధ్వర్యంలో సీఎస్‌ఆర్ కింద పాఠశాలకు కావాల్సిన మౌలిక సదుపా యాలు కల్పించామన్నారు. పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఆర్ట్ టీచర్ చిప్పకుర్తి శ్రీనివాస్ శిక్షణతో మెళకువలు నేర్చుకున్న విద్యార్థులు వేసిన వివిధ పెయింటింగ్‌లు, కళాకృతులు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం టీజీఎఫ్‌డీసీ అధికారులను హెచ్‌ఎం, ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధా నోపాధ్యాయురాలు అనురాధ, ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్‌కుమార్, సునీత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ప్రతీ విద్యార్థిలో నైపుణ్యం ఉంటుంది..
లక్షెట్టిపేట: ప్రతీ ఒక్క విద్యార్థిలో ఏదో ఒక నైపుణ్యం దాగి ఉంటుందని మోటివేషనల్ స్పీకర్ బొల్లంపల్లి సత్యప్రకాష్ అన్నారు. పట్టణంలోని బాలికల గురుకు లంలో గురువారం పీఎంశ్రీ స్కీంలో బాగంగా విద్యార్థు లకు ఏర్పాటు చేసిన మనో విశ్లేషణాత్మక ప్రేరణ శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిఽథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతీ ఒక్క విద్యార్థిలో అనేకమైన నైపు ణ్యాలు దాగి ఉంటాయని వాటికి వెలికితీసి దాన్నే లక్ష్యంగా పెట్టుకుని దాని సాధన కోసం కృషి చేయా లన్నారు. అనంతరం ప్రిన్సిపల్ రమాకళ్యాణి మాట్లాడు తూ ప్రతీఒక్కరు లక్ష్యం ఎంచుకుని చదివి పాఠశాలకు, తల్లితండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచిం చారు. కార్యక్రమంలో వైస్‌ప్రిన్సిపల్ ఉమామహేశ్వర్ రావు, జూనియర్ వైస్‌ప్రిన్సిపల్ శ్రీలత పాల్గొన్నారు.
Updated Date - Mar 13 , 2025 | 11:53 PM