రాష్ట్రానికే తలమానికంగా మంచిర్యాల అభివృద్ధి

ABN, Publish Date - Apr 06 , 2025 | 11:27 PM

మంచిర్యాల నియోజకవర్గాన్ని రా ష్ర్టానికే తలమానికంగా అభివృద్ధి చేసి చూపిస్తానని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసా గర్‌రావు అన్నారు. ఆదివారం మంచిర్యాల సూపర్‌ స్పెషాలిటి ఆసుపత్రి అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. అనం తరం పట్టణంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

రాష్ట్రానికే తలమానికంగా మంచిర్యాల అభివృద్ధి
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు

ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు

మంచిర్యాలక్రైం, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యో తి): మంచిర్యాల నియోజకవర్గాన్ని రా ష్ర్టానికే తలమానికంగా అభివృద్ధి చేసి చూపిస్తానని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసా గర్‌రావు అన్నారు. ఆదివారం మంచిర్యాల సూపర్‌ స్పెషాలిటి ఆసుపత్రి అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. అనం తరం పట్టణంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇప్పటికే 50కోట్లతో చేప ట్టిన ఆసుపత్రి పనులు పూర్తి చేశామన్నా రు. మరో 250 కోట్లు త్వరలోనే మంజూ రవుతాయన్నారు. మంచిర్యాల నియోజక వర్గాన్ని విద్య, వైద్య రంగాల్లో మారుతు న్న పరిస్థితులకు అనుగుణంగా అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. ఆసుపత్రిని 2027 జూన్‌ కల్లా అందుబాటులోకి తెస్తామన్నా రు. ఐబీ చౌరస్తాలో అంబేద్కర్‌ పాత విగ్రహం ఉన్న చోట కొత్తగా 12ఫీట్ల ఎత్తుతో పార్లమెంట్‌ నమూనాపై అంబే ద్కర్‌ విగ్రహాన్ని, మహాప్రస్థానాన్ని ఈ నెల 14న ప్రారంభిస్తామని తెలిపారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలను, నాయకుల ను ప్రజలు మర్చిపోయారన్నారు. అందు వల్లే బీజేపీ నాయకులు నియో జకవర్గం లోని దండేపల్లిలో చక్కర్లు కొడుతున్నార ని విమర్శించారు. రాముడి పేరు చెప్పి ఓట్లు అడగడం మానుకోవాలన్నారు. అయోధ్య నిర్మించిన ప్రాంతంలోనే ఓడిపోయినప్పటికీ బీజేపీ నాయకులకు బుద్ధి రావడం లేదన్నారు. మతం కాదు మానవత్వం ఉండాలని మతంకంటే మానవత్వమే గొప్పదన్నారు. అభివృద్ధి సంక్షేమాలనే తాను నమ్ముకు న్నానని ప్రజల రుణం తప్పకుండా తీర్చు కుంటానని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రేషన్‌ షాపుల ద్వారా సన్న బియ్యం అందిస్తుండడంతో ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు తూముల నరేశ్‌, భానేష్‌, బొలిశెట్టి కిషన్‌, దశరథం, కాటం రాజేశం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 06 , 2025 | 11:27 PM