ముందస్తు హోలీ సంబరాలు
ABN, Publish Date - Mar 13 , 2025 | 11:54 PM
మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాల లో గురువారం ముందస్తు హోలీ వేడుకలను నిర్వహించారు.
- పాల్గొన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు
తాండూర్, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాల లో గురువారం ముందస్తు హోలీ వేడుకలను నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు డ్యాన్సులు చేస్తూ ఉల్లాసంగా గడిపారు. పాఠశాల ఎస్‌వో కవిత మాట్లాడుతూ రసాయన రంగుల తో హోలీ ఆడితే అనారోగ్యం పాలవుతా మని, సంప్రదాయ రంగులతో హోలీ వేడుకలు జరుపుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుధారా ణి, సుమన, కళావతి, జ్యోత్స్న, శిరీష, ఉపాధ్యాయులు, విద్యారినులు పాల్గొన్నారు.
మందమర్రిటౌన్ (ఆంధ్రజ్యోతి): మందమర్రి ఏరియా లోని ఆయా గనుల వద్ద గురువారం సింగరేణి కార్మికులు ముందస్తు హోలీ వేడుకలను నిర్వహించారు. ఆయా డిపార్ట్‌మెంట్ల కార్మికులు ఒకరికొకరు రంగులు పూసుకుం టూ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం స్వీట్లు తినిపించుకున్నారు. కేకే5 గని వద్ద పిట్ సెక్రెటరీ సది ఆధ్వర్యంలో కార్మికులు అన్ని డిపార్ట్‌మెంట్ల వారీగా రంగులు చల్లి శుభాకాంక్షలు తెలిపారు. కార్మికులు పాల్గొన్నారు.
జన్నారం (ఆంధ్రజ్యోతి): మండలంలోని కలమడుగు వివేకానంద పాఠశాలలో ముందస్తు హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రంగులు చల్లుకు న్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎం సతీష్‌గౌడ్, తిరుపతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Updated Date - Mar 13 , 2025 | 11:54 PM