పార్టీలు మారడం కాదు.. ప్రజలకు ఏం చేశామన్నదే ముఖ్యం
ABN , Publish Date - Apr 14 , 2025 | 11:34 PM
పార్టీలు మారడం కాదు ప్రజలకు ఎంత వరకు మంచి చేశామనేదే ముఖ్యమని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణతో కలిసి ఆవిష్కరించారు.

- ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి
జైపూర్, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): పార్టీలు మారడం కాదు ప్రజలకు ఎంత వరకు మంచి చేశామనేదే ముఖ్యమని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణతో కలిసి ఆవిష్కరించారు. మంచిర్యాలలో జరిగిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమావేశంలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు వ్యాఖ్యలను ఖండించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి మాట్లాడుతూ కాకా కుటుంబమంటేనే సేవ చేసే కుటుంబమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా గుర్తించారన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి తన ఇంటికి వచ్చి కాంగ్రెస్‌లో చేరాలని కోరిన తర్వాతనే బీజేపీలో నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానని తెలిపారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఇప్పటి వరకు కాకా కుటుంబం నుంచే ఎంపీలుగా గెలిచి సత్తా చాటామన్నారు. బీజేపీలో ఉండి ఉంటే పెద్దపల్లి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయ్యేవాన్ని అని పేర్కొన్నారు. కేసీఆర్‌ను ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్‌లో చేరి ఓడించామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రిక్కుల శ్రీనివాస్‌రెడ్డి, మంతెన లక్ష్మణ్, పండగ రాజన్న, శీలం వెంకటేశం, గోనె నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
దళితులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలి
మందమర్రిటౌన్, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): గత డిసెంబరు నెల లో అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి దళితులకు ఇచ్చిన హామీ లను నెరవేర్చాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి పేర్కొన్నా రు. సోమవారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వారం రోజులు గా ముఖ్యమంత్రి బిజీగా ఉన్నా దళితులకు సంబంధించి సమయం కేటాయించకపోవడం సరైంది కాదన్నారు. మాల, లిడ్‌క్యాప్, నేతకాని కార్పోరేషన్లను ఏర్పాటు చేసి బడ్జెట్ కేటాయించాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దళితుల అబివృద్ధికి చర్యలు తీసుకోవా లన్నారు. అన్నిరంగాల్లో దళితులకు రిజర్వేషన్లు కల్పించేలా చొరవ చూపాలన్నారు. ఇటీవల చేపట్టిన జైభీం, సంవిధాన్ కార్యక్రమాలపై ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.