ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kumaram Bheem Asifabad: అంగన్‌వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లేవి?

ABN, Publish Date - Jan 11 , 2025 | 11:26 PM

అంగన్‌వాడీ కేంద్రాలకు పౌష్టికాహారం కోసం బాలింతలు, గర్బిణులు వస్తుంటారు. ఇక్కడ పనిచేసే అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలూ మహిళలే. 3-6వయస్సున్న చిన్నారులు గంటలకొద్ది కేంద్రాల్లోనే ఉంటారు.

- ఇబ్బందులు పడుతున్న గర్భిణులు, బాలింతలు

- ఒకటికి, రెంటికి బయటకే

- తప్పని అవస్థలు

- పట్టించుకోని అధికారులు

అంగన్‌వాడీ కేంద్రాలకు పౌష్టికాహారం కోసం బాలింతలు, గర్బిణులు వస్తుంటారు. ఇక్కడ పనిచేసే అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలూ మహిళలే. 3-6వయస్సున్న చిన్నారులు గంటలకొద్ది కేంద్రాల్లోనే ఉంటారు. ఇంతమంది అవసరార్థులున్నా జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు లేవు. దీంతో చిన్నారులు, మహిళలు ఇబ్బంది పడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా ఆయాకేంద్రాల్లో మరుగుదొడ్లు నిర్మించాలని డిమాండ్‌ ఉన్నా ఆయాశాఖల అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.

- బెజ్జూరు, జనవరి 11(ఆంధ్రజ్యోతి):

జిల్లాలో చాలాచోట్ల అంగన్‌వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు లేని కారణంగా అవస్థలు తప్పడం లేదు. పట్టణ ప్రాంతాల్లో కొన్నిచోట్ల మినహా ఎక్కడా కూడా మరుగుదొడ్లు, మూత్రశాలలు లేకపోవడంతో ఒకటికి, రెంటికి బయటకి వెళ్లక తప్పడం లేదు. అన్ని కేంద్రాల్లో వసతులు కల్పిస్తున్నామని ఉన్నతాధికారులు చెబుతున్నా ప్రకటనలకే తప్ప ఆచరణలో అమలు చూపిన దాఖలాలు కనిపించడం లేదని వాపోతున్నారు.

ఇబ్బందులు ఇలా..

అంగన్‌వాడీ భవనాల్లో మూత్రశాలలు, మరుగుదొడ్లు లేకపోవడంతో చిన్నారులను ఆరుబయటకు తీసుకెళ్తున్నారు. వర్షాకాలంలో విషసర్పాల బారిన పడే అవకాశం ఉంది. పరిసర ప్రాంతాల్లో నివాస గృహాల వారు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఏం చేయాలో తోచక అంగన్‌వాడీ కేంద్రాల్లోని సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. టీచర్లు, ఆయాలు సమీపంలోని పరిచయస్థుల ఇండ్లకు వెళ్లుతున్నారు. పాఠశాలల్లో, ఇతర ప్రభుత్వ భవనాల్లో కొనసాగుతున్న కేంద్రాల్లో కొంత పరిస్థితి మెరుగ్గా ఉన్నా అద్దె భవనాల్లో మాత్రం సమస్య తీవ్రంగా ఉంది. దీంతో వారికి ఇబ్బందులు తప్పడం లేదు.

ఎన్నాళ్లీ పరిస్థితి?

జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు, బాలింతలకు, గర్బిణులకు అన్ని వసతులు ఏర్పాటుకు కృషి చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా ఆ దిశగా చర్యలు మాత్రం కానరావడం లేదు. అంగన్‌వాడీకేంద్రాల్లో వసతుల లేమితో అవస్థలు ఎదుర్కొంటున్నా అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నా ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్న అభిప్రాయాలున్నాయి. ఎన్నో ఏళ్లుగా కేంద్రాల్లో సరైన వసతులు లేక నెట్టుకొస్తున్నామని కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు.

జిల్లాలోని మొత్తం అంగన్‌వాడీ కేంద్రాలు 973

------------------------------------------------------

పక్కా భవనాలున్నవి 317

పాఠశాలల్లో కొనసాగుతున్నవి 353

అద్దె భవనాల్లో కొనసాగుతున్నవి 303

జిల్లాలోని చిన్నారులు, గర్భిణులు, బాలింతలు

0-7చిన్నారులు 4898

7-12చిన్నారులు 5695

1-3ఏళ్లలోపు 17,809

3-6ఏళ్లలోపు 20,682

గర్భిణులు 4674

బాలింతలు 4955

- 250మరుగుదొడ్లు మంజూరు..

- ఆడెపు బాస్కర్‌, జిల్లా సంక్షేమ అధికారి

జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలకు సాక్ష్యం అంగన్‌వాడీ పథకం కింద 250అంగన్‌వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు మంజూరయ్యాయి. ఇందులో 80మరుగుదొడ్లు పూర్తి చేశారు. మరో 25కేంద్రాలకు మంచినీటి సౌకర్యానికి నిధులు మంజూరు చేశారు. ఒక్కో అంగన్‌వాడీ కేంద్రంలో నిర్మించే మరుగుదొడ్డికి రూ.36వేలు మంజూరైంది. ప్రస్తుతం సొంత భవనాలున్న వాటికి మాత్రమే నిధులుమంజూరయ్యాయి. అన్నిచోట్ల నిర్మాణం చేసేందుకు ప్రభుత్వానికి నివేదికలు పంపాం.

Updated Date - Jan 11 , 2025 | 11:26 PM