Kumaram Bheem Asifabad : త్వరలో దిందా వాగుపై వంతెన : ఎమ్మెల్సీ దండె విఠల్
ABN, Publish Date - Jan 10 , 2025 | 11:20 PM
చింతలమానేపల్లి, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): దిందా-కేతిని గ్రామాల మధ్య ఉన్న వాగుపై త్వరలోనే వంతెన నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు.
చింతలమానేపల్లి, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): దిందా-కేతిని గ్రామాల మధ్య ఉన్న వాగుపై త్వరలోనే వంతెన నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల చిరకాల వాంఛ అయిన వంతెన నిర్మాణాన్ని త్వరలోనే చేపడు తామన్నారు. కార్యక్రమంలో నాయ కులు గణపతి, విశ్వనాథ్, నానయ్య, అర్షద్ హుస్సేన్, శ్రీవర్ధన్, లింగయ్య, మహేష్, సురేష్, ప్రసాద్, శంకర్, నారాయణ, తదితరులు పాల్గొన్నారు.
ప్రైవేటుకు దీటుగా ఫలితాలు సాధించాలి..
సిర్పూర్(టి): ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రైవేటుకు దీటుగా ఫలితాలు సాధించాలని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. శుక్రవారం మండలంలోని వెంపల్లి, లోనవెల్లి, సిర్పూర్(టి) జిల్లా పరిషత్‌ఉన్నత పాఠశాలల్లో పదవ తరగతి విద్యార్థులకు అల్పాహారం కార్యక్రమం ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ విద్యార్థు లకు తనవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. పాఠశాల సమస్యలను ఉపాధ్యా యులు ఆయన దృష్టికి తీసుకురాగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానన్నా రు. తొలిసారిగా పాఠశాలకు వచ్చిన ఎమ్మెల్సీని సిబ్బంది ఘనంగా సన్మానించారు.
అనంతరం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆయన ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఆయన వెంట నాయ కులు గణపతి, తులసీరాం, అబ్దుల్ అకీల్, సోహెల్ అహ్మద్, సలీం, మమ్ము, ముత్తగిర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jan 10 , 2025 | 11:20 PM