Kumaram Bheem Asifabad: ప్రజామూత్రశాలల నిర్మాణాల్ని త్వరగా పూర్తిచేయాలి: కలెక్టర్
ABN, Publish Date - Jan 08 , 2025 | 11:32 PM
కాగజ్‌నగర్, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్ పట్టణంలోని ప్రజామూత్రశాలల నిర్మాణం త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ వెంకటేష్‌దోత్రే అన్నారు. బుధవారం కాగజ్‌నగర్‌పట్టణంలో ప్రజామూత్ర శాలల నిర్మాణపనులను పరిశీలించారు.
-కలెక్టర్ వెంకటేష్ దోత్రే
కాగజ్‌నగర్, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్ పట్టణంలోని ప్రజామూత్రశాలల నిర్మాణం త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ వెంకటేష్‌దోత్రే అన్నారు. బుధవారం కాగజ్‌నగర్‌పట్టణంలో ప్రజామూత్ర శాలల నిర్మాణపనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. మున్సిపాల్టీని శుభ్రంగా ఉంచడానికి స్వచ్ఛందసంస్థ ఆధ్వర్యంలో పురుషులకు, స్త్రీలకు వేర్వేరుగా మూత్రశాలల నిర్మించడం అభినందనీయమన్నారు. వ్యాపారులకు, మార్కెట్‌కువచ్చే ప్రజలకు ఈ మూత్రశా లలు ఎంతోసౌకర్యంగా ఉంటాయని తెలిపారు. ఈనెల 26కల్లా పనులు పూర్తి చేసి ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. సబ్‌కలెక్టర్ శ్రద్ధాశుక్లా మాట్లాడుతూ ప్రజామూత్రశాలల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ కిరణ్, కమిషనర్ అంజయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రభుత్వపాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి..
రెబ్బెన: ప్రభుత్వపాఠశాలలో మౌలికవసతుల కల్పనకు కృషి చేస్తు న్నట్టు కలెక్టర్ వెంకటేష్‌దోత్రే తెలిపారు. బుధవారం మండలంలోని నంబాలలో జడ్పీ పాఠశాను తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ పాఠశాలలో పెండింగ్ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. విద్యార్థుల డైట్ చార్జిలు పెంచినట్టు తెలిపారు. పదిపరీక్షల్లో అత్యుత్తమఫలితాలు సాధించాలన్నారు. ఇందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాంమోహన్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Updated Date - Jan 08 , 2025 | 11:32 PM