Kumaram Bheem Asifabad: ఆర్థిక సాధికారతతోనే మహిళల ఎదుగుదల
ABN, Publish Date - Jan 08 , 2025 | 11:30 PM
ఆసిఫాబాద్, జనవరి 8(ఆంధ్రజ్యోతి): మహిళలు ఆర్థికం గా సాధికారత సాధిస్తేనే వారి ఎదుగదలకు అవకాశాలు లభిస్తాయని రాష్ట్రఆర్థికశాఖ మంత్రి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.
- రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
ఆసిఫాబాద్, జనవరి 8(ఆంధ్రజ్యోతి): మహిళలు ఆర్థికం గా సాధికారత సాధిస్తేనే వారి ఎదుగదలకు అవకాశాలు లభిస్తాయని రాష్ట్రఆర్థికశాఖ మంత్రి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం ప్రజాభవన్ నుంచి వీడి యో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాలకలెక్టర్‌లు, అదనపు కలెక్టర్‌లు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. స్వయం సహాయకసంఘాల ద్వారా సోలార్‌పవర్ ప్లాంట్‌లు ఏర్పాటు ద్వారా 1000మెగా వాట్ల విద్యుత్‌ఉత్పత్తి చేసేం దుకు ఇప్పటికే ఇంధన, గ్రామీణాభివృద్ధి శాఖల మధ్య కుదిరిన ఒప్పందం నేపథ్యంలో భవిష్యత్ కార్యచరణకు చర్యలు తీసుకుంటు న్నామని తెలిపారు. నూతన విద్యుత్ పాలసీ, ఇంధన, గ్రామీణాభి వృద్ధి శాఖ మధ్య గత సంవ త్సరం ఒపందాన్ని జిల్లాలవారీగా అధికారులు ఉపయోగించుకుని అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. అయిదు సంవత్సరాలలో కోటి మంది మహిళ లను కోటీశ్వర్లుగా మార్చాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వెంకటేష్ దోత్రే మాట్లాడుతూ జిల్లాలో స్వయం సహాయ సంఘాలు, రైతుల ద్వారా సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Updated Date - Jan 08 , 2025 | 11:30 PM