ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kumaram Bheem Asifabad: మహనీయుల చరిత్రను భావితరాలకు అందించాలి: కలెక్టర్‌

ABN, Publish Date - Jan 11 , 2025 | 11:25 PM

ఆసిఫాబాద్‌ రూరల్‌, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): మహనీయుల చరిత్రను భావితరాలకు అందించాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు.

- కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

ఆసిఫాబాద్‌ రూరల్‌, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): మహనీయుల చరిత్రను భావితరాలకు అందించాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో జిల్లా వెనకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఒడ్డే ఓబన్న జయంతి వేడుకలో పాల్గొని చిత్రపటా నికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా మాట్లా డుతూ ఒడ్డే ఓబన్న ఉమ్మడి ఆంధ్రప్ర దేశ్‌లోని రాయలసీమలో రేనాడు ప్రాంతంలో 1816జనవరి 11న జన్మించా డన్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి ప్రధానఅనుచరుడిగా సంచార జాతులైన ఒడ్డెరలు, బోయలు, చెంచు జాతులకు నాయకత్వం వహిస్తూ నల్లమల్ల ప్రాంతంలో బ్రిటీష్‌ ఈస్ట్‌ ఇండియా కంపెనీ దౌర్జన్యాలను ఎదుర్కొని తన జాతులను కాపాడుకున్న మహనీయుడని కొనియాడరు. కార్యక్రమంలో బీసీ సంక్షే మాధికారి సజీవన్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ అలీబీన్‌ అహ్మద్‌, డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు, మాజీఎంపీపీ మల్లికా ర్జున్‌, వడ్డెర కుల సంఘాల ప్రతినిధులు కనకయ్య, హనుమంతు, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 11 , 2025 | 11:25 PM