ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kumaram Bheem Asifabad : విహంగాల పండుగకు వేళాయే..

ABN, Publish Date - Jan 11 , 2025 | 11:21 PM

మనిషి నిద్ర లేవక ముందే ప్రకృతి మేలుకుంటుంది. సూర్యుడు లేలేత అరుణ కిరణాల వెచ్చదనం వెలుగులను ప్రసాదిస్తుంది. పక్షుల కిలకిల రావాల సవ్వడి సంగీత జరిలా వినిపిస్తుంది.

- ఈనెల 17నుంచి 19వరకు బర్డ్‌వాక్‌ ఫెస్టివల్‌

- కాగజ్‌నగర్‌ డివిజన్‌ పరిధిలో 3వేల రకాల పైగా పక్షులు

- ఫెస్టివల్‌ వంద మందికి పైగా పాల్గొననున్న పక్షిప్రేమికులు

మనిషి నిద్ర లేవక ముందే ప్రకృతి మేలుకుంటుంది. సూర్యుడు లేలేత అరుణ కిరణాల వెచ్చదనం వెలుగులను ప్రసాదిస్తుంది. పక్షుల కిలకిల రావాల సవ్వడి సంగీత జరిలా వినిపిస్తుంది. మనసుపెట్టి చూడాలే గాని ప్రకృతి ఒక సంగీత, సాహిత్య నిలయం. అలాంటి నిలయంలోని అనుభూతులను పర్యటకులకు చూపించేందుకు జిల్లా అటవీశాఖ కొన్నేళ్లుగా చేస్తున్న ప్రయత్నమే బర్డ్‌వాక్‌ ఫెస్టివల్‌. ప్రకృతి పక్షి ప్రేమికుల కోసం బర్డ్‌ వాక్‌ ఫెస్టివల్‌ పేరిట ఈనెల 17, 18, 19 తేదీల్లో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

- పెంచికలపేట

పెంచికలపేట, జనవరి 11(ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్‌ అటవీ డివిజన్‌ పరిధిలో మూడో బర్డ్‌వాక్‌ ఫెస్టివల్‌ ప్రారంభం కానుంది. సుమారు 300రకాల పక్షులను చూసేందుకు రాష్ట్రంలోని పలుప్రాంతాల నుంచి పక్షిప్రేమికులు ఇక్కడికి రానున్నారు. ఈ ఫెస్టివల్‌లో కాగజ్‌నగర్‌, సిర్పూర్‌(టి), పెంచికలపేట, బెజ్జూరు రేంజ్‌ పరిధిలోని పక్షులను చూసేందుకు అటవీశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగజ్‌నగర్‌ అటవీప్రాంతం పరిధిలోని ఎల్లూరు బొక్కివాగు పరిసరప్రాంతాలు, చెడ్వాయి ఉచ్చమల్లవాగు ప్రాజెక్టు వీటితోపాటు పొడుగు ముక్కు రాబందుల ఆవాసాప్రాంతం పాలరాపు గుట్ట తదితర ప్రాంతాలు, బెజ్జూరు రేంజ్‌ పరిధిలోని గొల్లబాయి చెరువు పరిసర ప్రాంతాలను చూపించేందుకు అధికారులు నిర్ణయించారు.

పరిమిత పాసులు మాత్రమే..

2019సంవత్సరంలో ఈ ఫెస్టివల్‌ని మొట్టమొదటిసారిగా ఆసిఫాబాద్‌ జిల్లాలో ప్రారంభించారు. కానీ కొన్న కారణాల వల్ల మూడు సంవత్సరాలుగా పక్షుల పండుగను అధికారులు ఇక్కడ నిర్వహించడం లేదు. తిరిగి మళ్లీ ఇప్పుడు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో జరిపిన రెండు ఫెస్టివల్స్‌ కూడా లెక్కకు మించి ఔత్సాహికులు రావడంతో ఇటు అధికారులకు, ఔత్సాహికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ఈసారి ఈ ఫెస్టివల్‌ పడక్బందీగా నిర్వహించేందుకు అధికారులు లిమిటెడ్‌ పాసులను అందిస్తున్నట్లు సమాచారం. ఒక్కొక్క పాస్‌ ధర రూ.2500లుగా న్ణియించారు. ఇందులో అటవీప్రాంతంలోని పక్షులను చూడడాటానికి వాహనం, భోజన సదుపాయాం, రాత్రి బస కూడా అటవీ అధికారులు అందించనున్నారు. వచ్చిన ఔత్సాహికులను 25మందిగా గ్రూపులు ఏర్పాటు చేసి ఒక ప్రాంతం తరువాత మరొక ప్రాంతం మొత్తం నాలుగు రేంజ్‌ పరిధిలోని అటవీప్రాంతాల్లోకి తీసుకెళ్తారు. ఈ ఫెస్టివల్‌ 17న సాయంత్రం ప్రారంభమై 18నుంచి 19వ తేదీ ఉదయం ముగుస్తుంది.

ఏర్పాట్లు చేస్తున్నాం..

- బొబాడే సుశాంత్‌ సుఖదేవ్‌, ఎఫ్‌డీవో

మూడవ బర్డ్‌ వాక్‌ ఫెస్టివల్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఔత్సాహికులు కాగజ్‌నగర్‌ డివిజన్‌ ఆఫీస్‌కు వచ్చి రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. వివరాలు ఎఫ్‌డీవో కాగజ్‌నగర్‌(9346212281), ఎఫ్‌ఆర్వో పెంచికలపేట(9000003429), ఎఫ్‌ఆర్వో బెజ్జూరు (8328619863), వైల్డ్‌ ఫొటోగ్రాఫర్‌( 9550005343) సంప్రదించి నమోదు చేసుకోవాలి.

Updated Date - Jan 11 , 2025 | 11:33 PM