Kumaram Bheem Asifabad: రాష్ట్ర స్థాయిలో రాణిస్తేనే గుర్తింపు: ఎమ్మెల్యే హరీష్‌బాబు
ABN, Publish Date - Jan 15 , 2025 | 10:40 PM
బెజ్జూరు, జనవరి 15(ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో యువత క్రీడలపై పట్టు సాధించి రాష్ట్ర స్థాయిలో రాణిస్తేనే గుర్తింపు లభిస్తుందని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు అన్నారు.
బెజ్జూరు, జనవరి 15(ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో యువత క్రీడలపై పట్టు సాధించి రాష్ట్ర స్థాయిలో రాణిస్తేనే గుర్తింపు లభిస్తుందని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. మంగళవారం ఆయన మండలంలోని కుంటలమానేపల్లిలో కుమరంభీం స్మారక కబడ్డీ, వాలీబాల్ క్రీడల ముగింపులో పాల్గొని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామస్థాయిలో కాకుండా రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటాలని ఇందుకు తనవంతు ప్రోత్సాహం అందజే స్తానన్నారు. క్రీడలకోసం ప్రభుత్వ స్థలాన్ని క్రీడాస్థలంగా మార్చేందుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో నాయకులు మనోహర్‌గౌడ్, బాపు, విజయ్, వెంకటేష్, వసీఖాన్, భిక్షపతి, రాజేష్, బాలకృష్ణ, తుకారాం, రాజన్న, దిగంబర్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jan 15 , 2025 | 10:40 PM