Kumaram Bheem Asifabad: మార్లవాయి అభివృద్ధికి కృషి: ఎంపీ గోడం నగేష్
ABN, Publish Date - Jan 11 , 2025 | 11:23 PM
జైనూర్, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మార్ల వాయి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని ఎంపీ గోడం నగేష్ అన్నారు.
- హైమన్ డార్ఫ్, జెట్టి ఎలిజబెత్ వర్ధంతి
- పాల్గొన్న ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీ తదితరులు
జైనూర్, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మార్ల వాయి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని ఎంపీ గోడం నగేష్ అన్నారు. మండలంలోని మార్లవాయిలో శనివారం హైమన్ డార్ఫ్, బెట్టి ఎలిజిబెత్‌కు ఆయన.. కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యేలతో కలిసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన వర్ధంతిసభలో ఎంపీ ప్రసంగించారు. గతంలో మార్లావాయి గ్రామానికి మంత్రి హోదాలో వచ్చినప్పుడు కనీసం రోడ్డు లేని దుస్థితి ఉండేదన్నారు. రూ.5లక్షలతో రోడ్డు వేసిన ఘనత తనకే దక్కుతుందన్నారు. ఆదివాసుల అభివృద్ధి కోసం తనతండ్రి, మంత్రిహోదాలో తాను అనేకసంక్షేమ కార్యక్ర మాలు చేపట్టామన్నారు. మార్లవాయిలో వచ్చే ఏడాదిలో కనీసం 14మంది విద్యావంతులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారాలని సూచించారు. కలెక్టర్ వెంకటేష్ దోత్రే మాట్లాడుతూ.. ప్రొఫెసర్ హైమన్‌డార్ఫ్ సూచించిన విధంగా ఆదివా సులు తొలుత విద్యకే ప్రాము ఖ్యతనిస్తూ.. సంస్కృతీ, సంప్రదాయలను పరిరక్షించుకోవాలని అన్నారు. జైనూర్, సిర్పూర్(యు), లింగాపూర్, కెరమెరి మండలాల్లో ఆది వాసులకు పట్టాలు మంజూరయ్యేలా చొరవ తీసుకుంటామన్నారు. ఎస్పీ డీవీ శ్రీనివాస్‌రావ్ మాట్లాడుతూ హైమన్ డార్ఫ్ స్ఫూర్తితో ఆదివాసీగ్రామాల్లో అనేకసేవా కార్యక్ర మాలు చేపడుతు న్నామన్నారు. జైనూరులో ఇటీవలే 32మంది మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశామన్నారు. వర్ధంతి సభలో విద్యార్థినులుచేసిన నృత్యం ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఖానాపూర్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు, కోవ లక్ష్మి, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్త, ఏఎస్పీ చిత్తరంజన్, ఏటీడీవో రమాదేవి, జిల్లా మేడి మేస్రాం దుర్గుపటేల్, సార్మేడీ జుగునాక దేవరావ్, మాజీ సర్పంచులు మడావి భీంరావ్, కనక ప్రతిభ, మార్లావాయి డార్ఫ్ యువజన సంఘం సభ్యులు మధు, కనక వెంకటేష్, తహసీల్దార్ ఆడ బిర్షావ్, జైనూరు మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మెత విశ్వనాథ్, సహకార చైర్మన్ కొడప హన్నుపటేల్, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jan 11 , 2025 | 11:23 PM