Kumaram Bhim Asifabad: రోడ్డు భద్రత మాసోత్సవాలను విజయవంతం చేయాలి: కలెక్టర్
ABN, Publish Date - Jan 09 , 2025 | 10:53 PM
ఆసిఫాబాద్, జనవరి 9(ఆంధ్రజ్యోతి): జిల్లాలో చేపట్టిన రోడ్డుభద్రత మాసోత్సవా లను విజయవంతం చేయాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు.
- కలెక్టర్ వెంకటేష్ దోత్రే
ఆసిఫాబాద్, జనవరి 9(ఆంధ్రజ్యోతి): జిల్లాలో చేపట్టిన రోడ్డుభద్రత మాసోత్సవా లను విజయవంతం చేయాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. గురువారం కలెక్ట రేట్‌లో ఏర్పాటుచేసిన జిల్లా రహదారుల భద్రతాకమిటీ సమావేశంలో అదనపు కలె క్టర్ దీపక్‌తివారి, కాగజ్‌నగర్ సబ్‌కలెక్టర్ శ్రద్ధశుక్లాతో కలిసి పోలీసు,రెవెన్యూ, రవా ణా, రోడ్డు భవనాలు, గ్రామీణాభివృద్ధి, గిరి జన ఇంజనీరింగ్, విద్యశాఖాధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమా దాలు నియంత్రించేందుకు అవసరమైన అన్నిచర్యలు చేపట్టాలన్నారు. గ్రామాలు,మండలకేంద్రాల్లో, పట్టణాల్లో రోడ్డు భద్రతనియమాలపై విస్తృతప్రచారం చేపట్టాల న్నారు. విద్యార్థులకు రహదారి ప్రమాదాల నివారణపై వ్యాసరచన పోటీలు నిర్వహించి, పాటించాల్సిన నియ మాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జిల్లాలో గతసంవత్సరం 239 ప్రమాదాలు జరిగా యన్నారు. జిల్లాలో 45ప్రాంతాలను ప్రమా దాలు జరిగే బ్లాక్‌స్పాట్లను గుర్తించినట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు వేగ నిరోధ కాలను, సూచికలు ఏర్పాటు చేయాలని తెలిపారు. రహ దారుల మరమ్మతులు, వంతెనలు, కల్వర్టుల నిర్మాణాల పను లను త్వరగా పూర్తి చేయాలన్నారు. వాహనదారులు హెల్మెట్, సీటుబెల్టు తప్పనిసరిగా ధరించాలన్నారు. డ్రంకెన్‌డ్రైవ్ విస్తృతంగా చేపట్టాలని, కార్యక్రమంలో ఈఈ సురేష్, జిల్లా రవాణాశాఖాధికారి రాంచందర్, జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారి సీతారాం, జిల్లా గ్రామీ ణాభివృద్ధి అధికారి దత్తారాం, డీపీవో భిక్షపతి, తదితరులు పాల్గొన్నారు.
భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి..
జిల్లాలో వివిధ అభివృద్ధి పనుల్లో భాగంగా చేపట్టే భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ వెంకటేష్‌దోత్రే అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో ఆయన నీటిపారుదల, రోడ్డు భవనాలు, సింగరేణి, రైల్వే, రెవెన్యూశాఖాధికారులతో జిల్లాలోని వివిధ ప్రాజె క్టులు, చెరువులు, కాలువలు వంతెనలు, రహదారులు, సాగునీటి ప్రాజెక్టులు, సింగరేణి, రైల్వేలైన్ల విస్తరణకు అవసరమైన భూముల సేకరణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. సాగునీటి ప్రాజెక్టులైన కుమరం భీం, జగన్నాథ్‌పూర్, పీపీరావుప్రాజెక్టు, చెరువుల నిర్మాణం, కాలువల నిర్మాణం, రైల్వేలైన్ల ఏర్పాటులో సింగరేణి ఉపరితల గనుల ఏర్పాటుకు అవసరమైన భూముల కొరకు భూ సేకరణ ప్రక్రియను సమర్థవం తంగా నిర్వహించాలని తెలిపారు. అవసరమైన ప్రతి పాదనలు, రైతుల అంగీకారం తీసుకుని అవార్డులను రూపొందించాల న్నారు. అవార్డులు ఆమోదం పొందే విధంగా అధికారులు సమన్వయంతో పని చేయా లన్నారు. భూములు కోల్పోయిన వారికి నష్ట పరిహారం త్వరగా చెల్లించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. భూ సేకరణపై కోర్టుల్లోఉన్న కేసులను సత్వరమే పరిష్కారమయ్యే విధంగా కోర్టులకు నివేది కలు సమర్పించాలని తెలిపారు. కార్యక్ర మంలో నీటిపారుదల శాఖాధికారి గుణవం తరావు, ప్రభాకర్, సింగరేణి జీఎం శ్రీనివాస్, రెవెన్యూ, రోడ్డు భవనాలు, పంచాయతీ రాజ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.
గ్రామపంచాయతీల అభివృద్ధికి
కృషి చేయాలి..
జిల్లాలో గ్రామ పంచాయతీల అభివృద్ధికి అధికారులు కృషిచేయాలని కలెక్టర్ వెంకటేష్‌దోత్రే అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో ఎంపీడీవో, ఎంపీ ఆర్వో, కార్యదర్శులు, ఉపాధిహామీ అధికారులతో పంచా యతీల అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో జరిగే అభివృద్ధితో రాష్ట్ర, దేశాభివృద్ధి జరుగు తుందన్నారు. జిల్లాలోని గ్రామ పంచాయతీల అభివృద్ధి దిశగా అధికారులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారాం, డీపీవో భిక్షపతి, జడ్పీసీఈవో లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.
‘ట్రెసా’ క్యాలెండర్ ఆవిష్కరణ..
తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్(ట్రెసా) క్యాలెండర్‌ను గురువారం కలెక్టర్ వెంకటేష్‌దోత్రే ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపుకలెక్టర్‌లు దీపక్ తివారి, డేవిడ్, కలెక్టరేట్ ఏవో మధుకర్, తహసీల్దార్‌లు, డీఈలు, రెవెన్యూసిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Jan 09 , 2025 | 10:53 PM