తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలి

ABN, Publish Date - Mar 13 , 2025 | 11:50 PM

వేసవికాలంలో ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ సూచించారు. గురువారం జిల్లాలోని చెన్నూరు మున్సిపల్‌ పరిధిలో 6,7 వార్డుల్లో తాగునీటి సరఫరా ప్రక్రియను మున్సిపల్‌ కమిషనర్‌ మురళీ కృష్ణతో కలిసి పరిశీలించారు.

తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలి
ఆసుపత్రిలోని వార్డును పరిశీలిస్తున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

- మంచిర్యాల కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

చెన్నూరు, మార్చి 13 (ఆం ధ్రజ్యోతి): వేసవికాలంలో ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ సూచించారు. గురువారం జిల్లాలోని చెన్నూరు మున్సిపల్‌ పరిధిలో 6,7 వార్డుల్లో తాగునీటి సరఫరా ప్రక్రియను మున్సిపల్‌ కమిషనర్‌ మురళీ కృష్ణతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భం గా కలెక్టర్‌ మాట్లాడుతూ వేసవిలో ప్రజల కు ఎలాంటి అంతరాయం లేకుండా లేకుండా శుద్ధమైన తాగునీటిని అందించాలని తెలిపారు. నీటి ట్యాంకులు, పైపులైన్ల లీకేజీ సమస్యలను తక్షణమే పరిష్కరించి నీటి సరఫరా పునరుద్ధరించేలా చర్యలు చేపట్టా లని తెలిపారు. అనంతరం పట్టణంలోని జిన్నింగు మిల్లులో ఏర్పాటు చేసిన సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ప్రభుత్వం రైతు సంక్షేమంలో భాగంగా సీసీఐ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి రైతుల వద్ద నుంచి మద్దతు ధర చెల్లించి పత్తి కొనుగోలు చేస్తామన్నారు. అనంతరం చెన్నూరులో గల ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి వార్డులు, రిజిస్టర్లు, ఆసుపత్రి పరిసరాలను పరిశీలించారు. జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా క్షయ, మొండి క్షయ కేసులను పరీక్షలు చేసి గుర్తించేందుకు ట్రూనాట్‌ యంత్రాన్ని ప్రారంభించారు. అనంతరం మున్సిపల్‌ కార్యాలయాన్ని సందర్శించి రిజిష్టర్‌లను తనిఖీ చేశారు. ఆస్తి పన్నులు వంద శాతం వసూలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో క్షయ ప్రోగ్రాం సమన్వయకర్త సురేందర్‌, సీనియర్‌ ట్రీట్‌ మెంట్‌ సూపర్‌ వైజర్‌ అశోక్‌, ల్యాబ్‌ సూప ర్‌ వైజర్‌ వేణు పాల్గొన్నారు.

దివ్యాంగులు తప్పనిసరిగా

యుడీఐడీ పొందాలి

మంచిర్యాల కలెక్టరేట్‌: భ్రుత్వ మార్గదర్శకాల ప్రకారం జిల్లాలోని దివ్యాం గులు యునిక్‌ డిసెబిలిటి ఐడీ కార్డు పొందాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నా రు. గురువారం కలెక్టరేట్‌ కార్యాల యంలో డీఆర్‌డీవో కిషన్‌, ఆర్‌ఎంవో భీష్మతో కలిసి ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది, ఎంపీడీవోలు, మీ సేవ ఆపరేటర్లకు సదరం నుంచి యుడీఐడీ బదలాయింపుపై శిక్షణ కార్యక్ర మం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సదరం సర్టిఫిఎట్‌కు బదులుగా యుడీఐడీ పొందేందుకు అర్హులు మీ సేవ కేంద్రాల ద్వారా వివరా లు నమోదు చేసి యుడీఐడీ కార్డు పొం దాలన్నారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 13 , 2025 | 11:50 PM