కల్లోల కాలంలో జీవించిన కవి అలిశెట్టి
ABN, Publish Date - Jan 13 , 2025 | 01:32 AM
కల్లోల కాలంలో జీ వించిన కవి అలిశెట్టి ప్ర భాకర్ అని ప్రెస్ అకాడమీ మాజీ అఽధ్యక్షుడు అల్లం నారాయణ అన్నారు.
కల్లోల కాలంలో జీవించిన కవి అలిశెట్టి
ప్రెస్ అకాడమీ మాజీ అఽధ్యక్షుడు అల్లం నారాయణ
నల్లగొండ కల్చరల్, జనవరి 12 (ఆంధ్రజ్యో తి): కల్లోల కాలంలో జీ వించిన కవి అలిశెట్టి ప్ర భాకర్ అని ప్రెస్ అకాడమీ మాజీ అఽధ్యక్షుడు అల్లం నారాయణ అన్నారు. కరీంనగర్‌లోని ఫిలింభవనలో ఆదివారం తెరవే ప్రధాన కార్యదర్శి దామరకుంట శంకరయ్య అధ్యక్షతన నిర్వహించిన అలిశెట్టి ప్రభాకర్ రాష్ట్ర స్థాయి పురస్కారం-2025 సభ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పురస్కారాన్ని నల్లగొండ జిల్లా కవి డాక్టర్ బెల్లి యాదయ్యకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అలతి అలతి పదాలతో అనంత అర్థాలను సృజించిన గొప్ప కవి త్వం అలిశెట్టిదని అన్నారు. ప్రజల పక్షం వహించి కవిత్వం అలిశెట్టి రాశారని చె ప్పారు. అది ఎక్కువ ప్రసంగిత కల సాహిత్యమని అన్నారు. పురస్కార శాశ్వత ప్రదాత, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు మాట్లాడుతూ అలిశెట్టి స్ఫూర్తితో సమ సమాజ నిర్మాణం కోసం కవులు కృషి చేయాలని అన్నారు. అలిశెట్టి స్ఫూర్తిని, ఆకాంక్షలను వచ్చే తరాలకు అందించాలని కోరారు. తెలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్ బూర్ల వెంకటేశ్వర్లు, డాక్టర్ బెల్లి యాదయ్యను పరిచయం చేశారు. కార్యక్రమంలో ప్రజా గాయకుడు చింతల యాదగిరి, పాటల వెంకన్న, విప్లవకుమార్, క్రాంతి, కంబాలపల్లి కృష్ణ, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల లెక్చరర్ల సంఘం ప్రఽధాన కార్యదర్శి సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jan 13 , 2025 | 01:32 AM